-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy Breaking news Cinema Business and National International news across globe 21th sept 2025 kjr
-
BREAKING: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం: ప్రధాని మోదీ
ABN , First Publish Date - Sep 21 , 2025 | 06:35 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 21, 2025 20:50 IST
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
ఓయూ, తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో వర్షం
నాచారం, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం
-
Sep 21, 2025 17:26 IST
దేశంలో కొత్త మధ్యతరగతి వర్గం పెరుగుతోంది.. వారికి ఇది ప్రోత్సాహకరం
పర్యాటక రంగానికి జీఎస్టీ సంస్కరణలు ఎంతో మేలు: ప్రధాని మోదీ
హోటల్స్ సేవలపై కూడా జీఎస్టీ తగ్గించాం: ప్రధాని మోదీ
సంస్కరణలు సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతం: మోదీ
జీఎస్టీ తగ్గింపుతో MSMEలు కూడా లాభపడతాయి: మోదీ
దేశంలోకి చాలా విదేశీ వస్తువులు వచ్చాయి: ప్రధాని మోదీ
ప్రజలు మేడిన్ ఇండియా ఉత్పత్తులే వాడాలి: ప్రధాని మోదీ
దేశం సమృద్ధిగా ఉండాలంటే దేశీయ ఉత్పత్తులే వాడాలి: మోదీ
-
Sep 21, 2025 17:26 IST
వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి: ప్రధాని మోదీ
అన్ని వర్గాలతో చర్చించి జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చాం: మోదీ
నిత్యావసరాల వస్తువులపై 5 శాతం మాత్రమే పన్ను: మోదీ
కేవలం జీఎస్టీలో రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి: మోదీ
12 శాతంలో ఉన్న 99 శాతం వస్తువులకు 5 శాతం పన్ను శ్లాబ్
ఇప్పటికే రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు: మోదీ
మధ్య తరగతికి జీఎస్టీ సంస్కరణలతో డబుల్ బోనాంజా: ప్రధాని మోదీ
-
Sep 21, 2025 17:26 IST
జీఎస్టీ వచ్చాక అనేక రకాల పన్నుల నుంచి ప్రజలకు ఉపశమనం
జీఎస్టీ సంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది: మోదీ
జీఎస్టీ సంస్కరణలతో ప్రజల పొదుపు పెరుగుతుంది: మోదీ
జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలవారికి లాభం: ప్రధాని మోదీ
అనేక రకాల ట్యాక్స్‌లతో వ్యాపారులు కూడా ఇబ్బంది పడ్డారు
రేపటి నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరియనున్నాయి: మోదీ
అన్ని రకాల పన్నులను రద్దు చేసిన 2017లో జీఎస్టీ తీసుకువచ్చాం
జీఎస్టీ రాకముందు పన్నులు విధించి ఆటంకాలు కలిగించేవారు
-
Sep 21, 2025 17:06 IST
ఢిల్లీ: జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం: ప్రధాని మోదీ
జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు: మోదీ
జీఎస్టీ మార్పులతో రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయి
కొత్త జీఎస్టీ వల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం
ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతమిస్తాయి: ప్రధాని మోదీ
సరికొత్త చరిత్ర సృష్టించేందుకు జీఎస్టీ సంస్కరణలు సాయం చేస్తాయి
-
Sep 21, 2025 16:58 IST
కర్నూలు: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
మంత్రాలయం మం. బూదురులో సీటు రాక చదువుకు దూరమై...
పొలం పనులు చేస్తున్న మీనుగ జెస్సీకి మంత్రి లోకేష్ భరోసా
మంత్రి లోకేష్ ఆదేశాలతో ఆరోతరగతి చిన్నారి జెస్సీకి పాఠశాలలో సీటు
చిలకలడోన కస్తూర్భా స్కూల్‌లో సీటు కేటాయించిన కలెక్టర్, డీఈవో
-
Sep 21, 2025 16:58 IST
సూర్యాపేట: ఆల్మట్టి డ్యామ్ పెంపునకు తెలంగాణ వ్యతిరేకం: మంత్రి ఉత్తమ్
ఆల్మట్టి డ్యామ్‌పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది: మంత్రి ఉత్తమ్
ఆల్మట్టి డ్యామ్ పెంపును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో వాదనలు వినిపిస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతోంది: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తుమ్మిడిహట్టి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల పనులు పూర్తిచేస్తాం: ఉత్తమ్
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోసం పోరాడుతాం: ఉత్తమ్
-
Sep 21, 2025 16:58 IST
ఢిల్లీ: కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
ఇవాళ అర్ధరాత్రి నుంచే అమల్లోకి GST 2.O
మోదీ ఏఏ అంశాలు ప్రస్తావిస్తారా అని స్వర్వత్రా ఉత్కంఠ
GST సంస్కరణలపై ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం
-
Sep 21, 2025 12:59 IST
ఆరోగ్య కేంద్రం వద్ద బాధితుల ఆందోళన..
నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద బాధితుల ఆందోళన..
సీతారాంపురం మండలం బసినేనిపల్లి చెందిన మంజుల పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరిక.
మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు, హార్ట్ బీట్ తక్కువ ఉండడంతో బిడ్డ మృతి.
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందాడంటూ మహిళ బంధువుల ఆందోళన.
వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో బిడ్డ చనిపోయారని మంజుల భర్త చంద్రశేఖర్, బంధువులు ఆరోపణ.
పోలీసులకు ఫిర్యాదు, విచారణ చేస్తున్న పోలీసులు
-
Sep 21, 2025 12:07 IST
యూనియన్ బ్యాంక్ మేనేజర్ బాగోతం
హనుమకొండ ధర్మసాగర్ మండలంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ బాగోతం
నకిలీ పత్రాలు సృష్టించి సొంత బ్యాంకులో బంగారు రుణాలు తీసుకున్న మేనేజర్ సురేష్
ధర్మసాగర్ మండలం ముప్పారం యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఘటన
పది గోల్డ్ లోన్ అకౌంట్లు తెరిచి రూ. 74,92, 000 మంజూరు
బ్యాంక్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో విచారణ చేపట్టిన అధికారులు
గోల్డ్ లాకర్ లో ఖాళీ గోల్డ్ పౌచ్‌లు గుర్తింపు
ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో మేనేజర్ సురేష్ పై ఉన్నతాధికారుల ఫిర్యాదు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Sep 21, 2025 10:21 IST
దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న బీజేపీ ‘సేవా పక్వాడ’
డ్రగ్స్ రహిత భారత్ కోసం నమో యువ రన్
రన్‌లో పాల్గొన్న బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు
ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా.. అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న బీజేపీ సేవా పక్వాడ
-
Sep 21, 2025 09:46 IST
గాజులరామారంలో హైడ్రా బిగ్ ఆపరేషన్
హైదరాబాద్ గాజులరామారంలో హైడ్రా బిగ్ ఆపరేషన్.
సర్వే నెంబర్ 307లో అక్రమ కట్టడాల కూల్చివేత.
భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతున్న కూల్చివేతలు.
కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులు.
స్థానికులకు హైడ్రాధికారులకు మధ్య వాగ్వాదం.
ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ ఇళ్ళను కూల్చి వేస్తున్నారంటూ బాధితుల ఆవేదన.
దేవేందర్ నగర్, బాలయ్య బస్తి, పోచమ్మ బస్తీలు వందలాది ఇళ్లు నేలమట్టం.
ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్న హైడ్రా.
-
Sep 21, 2025 09:05 IST
క్యాప్స్ గోల్డ్‌లో 5వ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
సికింద్రాబాద్‌లోని ఆవుల మంద ప్రాంతంలో ఉన్న క్యాప్స్ గోల్డ్ కార్యాలయంలో ముగిసిన ఐటీ సోదాలు
మరికొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు
సికింద్రాబాద్ క్యాప్స్ గోల్డ్ కార్యాలయంలో లాప్టాప్స్, పెన్ డ్రైవ్లు స్వాధీనం
సికింద్రాబాద్ క్యాప్స్ గోల్డ్ కార్యాలయాన్ని సీజ్ చేసిన ఐటీ అధికారులు
కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
-
Sep 21, 2025 08:40 IST
రేపటి నుంచి ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు
రేపటి నుంచి రెండు రోజులపాటు ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు
ఏపీ సీఎంతో పాటు కేంద్ర, రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు హాజరు
సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాటు చేస్తున్న జిల్లా యంత్రాంగం
-
Sep 21, 2025 08:16 IST
నేటి నుంచి మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు
2004 సెప్టెంబర్ 21 న మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావం
21 ఏళ్ల ప్రస్థానంలో ఆఖరి యుద్ధం చేస్తున్న మావోయిస్ట్ లు
ఆపరేషన్ కగార్ పంజా దెబ్బకు నేల రాలిన అగ్ర నేతలు
మే 21 న పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్‌తో పెద్ద ఎదురు దెబ్బ
వరుస ఎన్ కౌంటర్లలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు కీలక రాష్ట్ర కమిటీ సభ్యులు హతం
పార్టీ ఆవిర్భావం నాడు 42 మంది కేంద్ర కమిటీ సభ్యులు ప్రస్తుతం అరెడుమంది మాత్రమే
మావోయిస్ట్ పార్టీలో నాయకత్వం కోసం విబేధాలు
మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ వారోత్సవాల తో ఛత్తీస్ గడ్ తెలంగాణ సరిహద్దులో హై అలర్ట్
అడవి నీ జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు