Washing Face After Crying: ఏడ్చాక చల్లని నీటితో ఎందుకు ఫేస్ వాష్ చేసుకోవాలి? రీజన్ ఇదే..
ABN , Publish Date - Aug 27 , 2025 | 03:29 PM
ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ఏదొక సందర్భంలో కచ్చితంగా ఆపుకోలేనంత దుఃఖం వస్తుంది. అయితే, ఏడ్చిన తర్వాత చల్లని నీళ్లతో ముఖం కడుక్కోమని పెద్దలు తరచూ చెప్తుంటారు. ఈ పద్ధతి శరీరానికి, మనసుకూ థెరపీ లాంటిదా?
జీవితంలో కొన్నిసార్లు ఏ వ్యక్తి అయినా తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేడు. తీవ్రంగా ఏడ్చిన సందర్భాలు ఉండే ఉంటాయి. ఏడవడం వెనుక కారణాలు భిన్నంగా ఉండవచ్చు. కానీ ఏడ్చిన తర్వాత అందరూ ఒక విషయం కచ్చితంగా పాటిస్తారు. అదే ఏడ్చిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం. అవును ఏడుపు పూర్తయ్యాక ఎవరూ చెప్పకుండానే చాలామంది చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం సర్వసాధారణం. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలుసా? ఈ పని కళ్ళ వాపును తగ్గించడానికి లేదా ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి మాత్రమే చేస్తారని అనుకుంటే పొరపాటే. ఏడ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడం అనే పద్ధతి శరీరానికి, మనసుకూ థెరపీ లాంటిదా? కాదా? సైన్స్ పరిశోధనలు చెబుతున్న ఆసక్తికర నిజాలు ఇవే..
నాడీ వ్యవస్థ ప్రశాంతం
ఒక వ్యక్తి ఏడ్చినప్పుడు అతడు/ఆమె శరీరం కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది అలసటకు కారణమవుతుంది. మనస్సును భారంగా చేస్తుంది. కానీ ముఖాన్ని చల్లటి నీటితో కడిగినప్పుడు ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గుతుంది, శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. ఈ కారణంగా శరీరానికి మంచి అనుభూతిని కలిగించే సంతోషకరమైన హార్మోన్లు కూడా విడుదల కావడం ప్రారంభమవుతుంది.
నొప్పిని తగ్గించే సంతోషకరమైన హార్మోన్లు
ఏడ్చిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల శారీరక, మానసిక బాధలు తగ్గుతాయి. చల్లటి నీరు మెదడుకు విద్యుత్ ప్రేరణలను పంపుతుంది. ఆ తర్వాత ఎండార్ఫిన్లు వంటి అనుభూతిని కలిగించే హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒత్తిడి దూరం
మీరు మీ ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది మీ మెదడుకు తేలికపాటి షాక్ ఇస్తుంది. వ్యక్తి ఒత్తిడిని ఒక్కసారిగా పోగొట్టి ఉత్సాహంగా ఉన్న భావన కలిగిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
బంగారం, వెండి ఆభరణాలను పింక్ పేపర్లోనే ఎందుకు చుడతారో తెలుసా?
మహిళలు వయస్సు, పురుషులు జీతాన్ని ఎందుకు గోప్యంగా ఉంచాలి? కారణమిదే!
For More Devotional News