Share News

Vinayaka Chaturthi 2025: గణేష్ చతుర్థి.. పొరపాటున కూడా ఈ పని చేయకండి..

ABN , Publish Date - Aug 27 , 2025 | 02:55 PM

దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి పండుగ ప్రారంభమైంది. అయితే, ఈ పండుగ సమయంలో కొన్ని చేయకుడని పనులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vinayaka Chaturthi 2025: గణేష్ చతుర్థి.. పొరపాటున కూడా ఈ పని చేయకండి..
Vinayaka Chaturthi 2025

ఇంటర్నెట్ డెస్క్: గణేష్ చతుర్థి పండుగ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. భక్తులు బప్పా విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి భక్తితో ప్రతిష్టిస్తారు. గణపతి పండుగ సమయంలో బప్పా ఇంటికి రావడంతో వాతావరణం మొత్తం ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. బప్పా ఇంటికి వచ్చినప్పుడు, వాతావరణం పవిత్రంగా, స్వచ్ఛంగా మారుతుంది. అయితే, గణపతి ఇంట్లో ఉన్న సమయంలో కొన్ని చేయకుడని పనులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


గణపతి ఉన్న ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఈ సమయంలో కోపం పడటం, గొడవ చేయడం వంటి పనులు చేయకుండా ఉండాలి. ఇంట్లో విభేదాలు లేదా సంఘర్షణ పరిస్థితులను సృష్టించే ఏ పని చేయకండి.


గణేశోత్సవం సందర్భంగా, ఇంట్లో సాత్విక ఆహారాన్ని తీసుకోండి. వెల్లుల్లి, ఉల్లిపాయలు లేదా మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండండి. ఇంట్లో మద్యం లేదా మత్తు పదార్థాలను తీసుకోకండి.


ఇంట్లో గణపతి ఉంటాడు కాబట్టి, ఇంటిని పూర్తిగా శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా పూజా స్థలం దగ్గర ఎలాంటి మురికి ఉండకూడదు. ఈ ప్రదేశంలో తాజా పువ్వులు, దండలు ఉంచండి. వాతావరణాన్ని సువాసనగా ఉంచండి.

గణేష్ ఉత్సవ సమయంలో జుట్టు, గడ్డం లేదా గోర్లు కత్తిరించకూడదనే నమ్మకం కూడా ఉంది. అలాగే, బూట్లు లేదా చెప్పులు ధరించి ఇంటికి రాకూడదు. ఇది బప్పాను అవమానించడం అవుతుంది. కాబట్టి, గణపతి ఉన్న ఇల్లు పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

Also Read:

వంటగది నుండి చెత్త వాసన వస్తోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..

మహిళలు వయస్సు, పురుషులు జీతాన్ని ఎందుకు గోప్యంగా ఉంచాలి? కారణమిదే!

For More Latest News

Updated Date - Aug 27 , 2025 | 02:56 PM