IRCTC Jyotirlinga Tour: 7 జ్యోతిర్లింగాల యాత్ర ప్యాకేజీని ప్రకటించిన భారత రైల్వే..రేట్లు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:53 PM
మీరు ఎప్పటినుంచో జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చూస్తున్నారా. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే ఓ అద్భుతమైన యాత్రను ప్రకటించింది. ట్రైన్ ద్వారా 7 జ్యోతిర్లింగాల యాత్రను తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
శివ భక్తుల కోసం భారతీయ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో IRCTC ఏడు జ్యోతిర్లింగాల యాత్రను (Jyotirlinga Tour) ప్రకటించింది. భారత్ గౌరవ్ ట్రైన్ ద్వారా ఈ 12 రోజుల యాత్రలో ఏడు పవిత్ర జ్యోతిర్లింగాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ యాత్ర నవంబర్ 18న రిషికేశ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. శివుడి పవిత్ర ఆలయాలను దర్శించడంతో పాటు, ఈ యాత్రలో భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆ వివరాలను ఇక్కడ చూద్దాం.
ఏ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు?
ఓంకారేశ్వర్: మధ్యప్రదేశ్‌లోని ఈ పవిత్ర ఆలయం నర్మదా నది తీరంలో ఉంది.
మహా కాళేశ్వర్: ఉజ్జయినిలో ఉన్న ఈ ఆలయం శివుడి అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటి.
నాగేశ్వర్: గుజరాత్‌లోని ఈ ఆలయం ద్వారకకు సమీపంలో ఉంది.
సోమనాథ్: గుజరాత్‌లోని సముద్రతీరంలో ఉన్న పురాతన జ్యోతిర్లింగం.
త్రయంబకేశ్వర్: మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో కలదు.
భీమాశంకర్: పూణే సమీపంలో సహ్యాద్రి పర్వతాలలో ఉంది.
గృష్ణేశ్వర్: ఔరంగాబాద్ సమీపంలో ఈ ఆలయం కలదు.
ఈ యాత్రలో ద్వారకాధీశ్, బెట్ ద్వారక వంటి ఇతర ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించవచ్చు. ఈ పవిత్ర స్థలాలన్నీ శివ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయి.
టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? ధరలు ఎంత?
ఈ యాత్ర కోసం టికెట్లను IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ధరలు మీరు ఎంచుకునే కేటగిరీపై ఆధారపడి ఉంటాయి.
కంఫర్ట్ (2AC): ఒక్కొక్కరికీ రూ. 54,390
స్టాండర్డ్ (3AC): ఒక్కొక్కరికీ రూ. 40,890
ఎకానమీ (స్లీపర్): ఒక్కొక్కరికీ రూ. 24,100 రూపాయలు
భారత్ గౌరవ్ యోజన కింద 33% వరకు డిస్కౌంట్ ఉంది.
ప్యాకేజీలో ఏం ఉన్నాయి?
ఈ యాత్రలో భక్తుల సౌకర్యం కోసం అనేక సదుపాయాలు ఉన్నాయి.
రైలు ప్రయాణం
బడ్జెట్ హోటళ్లలో రాత్రి బస
ఎంచుకున్న కేటగిరీ ప్రకారం హోటళ్ల చేంజ్ సౌకర్యం
భోజనాలు (మార్నింగ్ టీ, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం శాఖాహారం మాత్రమే)
ప్రయాణ బీమా
ప్రొఫెషనల్ టూర్ ఎస్కార్ట్‌ల సేవలు
IRCTC టూర్ మేనేజర్లు ప్రయాణంలో మీకు తోడుగా ఉంటారు
యాత్ర వివరాలు (Tour Details)
ప్రారంభ తేదీ: నవంబర్ 18, 2025
ముగింపు తేదీ: నవంబర్ 29, 2025
మొత్తం వ్యవధి: 11 రాత్రులు / 12 రోజులు
ప్రారంభ స్థలం: రిషికేశ్
బోర్డింగ్ ఆప్షన్లు: హరిద్వార్, లక్నో, కాన్పూర్, ఇతర స్టేషన్లు
ట్రైన్ సామర్థ్యం: 767 మంది ప్రయాణికులు
ప్రయాణికులు బోర్డింగ్ సమయంలో తమ గుర్తింపు కార్డు తీసుకు రావాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి