IRCTC Packages: ఫారన్ ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా?.. ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:10 PM
ఫారన్ ట్రిప్‌కు ప్లాన్ చేసుకునే వారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ దేశాల పర్యటనకు వెళ్లే వారికి అందుకు అనుగుణంగా ధరలను నిర్ణయిస్తుంది.
ఫారన్ ట్రిప్‌కు ప్లాన్ చేసుకునే వారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా దుబాయి టూర్ ప్లాన్ చేసుకునే వారి కోసం ఒక ప్యాకేజీని సిద్ధం చేసింది. నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు సాగే ఈ ట్యూర్ ప్యాకేజీ ధరను కాస్తా అటు ఇటుగా రూ. లక్షగా నిర్ణయించింది.
ఈ పర్యటన వివరాలు..
2026, జనవరి 23వ తేదీన ఈ విహారయాత్ర ప్రారంభమవుతుంది. 4 రాత్రులు, 5 పగల్లు సాగే ఈ టూర్ ప్యాకేజీ ధర రూ. 1,12,000 నుంచి ప్రారంభమవుతుంది.
తొలి రోజు..
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం 10 గంటలకు విమానం ఎక్కితే.. మధ్యాహ్నం 12.25 గంటలకు దుబాయి చేరుకుంటారు. స్థానిక హోటల్‌లో మధ్యాహ్నం భోజనం చసి విశ్రాంతి తీసుకోవచ్చు. సాయంత్రం ధో క్రూజ్ దుబాయి మెరీనాను సందర్శించ వచ్చు. అక్కడే రాత్రి భోజనం చేసి హోటల్‌లో నిద్రించాల్సి ఉంటుంది.
రెండో రోజు..
ఉదయం అతి పెద్ద అబ్జర్వేషన్ వీల్ ఇన్ దుబాయితోపాటు నగరం మొత్తం సందర్శించ వచ్చు. రెస్టారెంట్‌లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత డిజర్ట్ సఫారీ ఎంజాయ్ చేయవచ్చు. రాత్రికి తిరిగి హోటల్‌కు చేరుకోవాలి.
మూడో రోజు..
ఉదయం మిరాకిల్ గార్డెన్, గ్లోబల్ విలేజ్ చూడాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత బుర్జ్ ఖలీఫాను సందర్శించ వచ్చు. రాత్రి లైట్ షో కూడా వీక్షించ వచ్చు. ఆ రాత్రి అక్కడే భోజనం చేసి తిరిగి హోటల్‌కు చేరుకోవాలి.
నాలుగో రోజు..
ఉదయం దుబాయి నుంచి అబుధాబికి తీసుకెళ్తారు. యూఏఈలోని హిందూ దేవాలయం బాప్స్‌ను సందర్శించ వచ్చు. ఫెర్రారీ వరల్డ్ ఫొటో షూట్, షక్ జాయెద్ మసీదు చూసి.. స్థానిక ఇండియన్ రెస్టారెంట్‌లో రాత్రి భోజనం చేయాలి. అనంతరం తిరిగి హోటల్‌కు చేరుకోవాలి.
ఐదో రోజు..
ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేసిన అనంతరం దుబాయి ఫ్రేమ్ చూడొచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత షాపింగ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తారు. ఇక సాయంత్రం 6.30 గంటలకు దుబాయి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి. రాత్రి 9.30 గంటలకు విమానం ఎక్కితే.. తెల్లవారే 2.25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
ఒక గమనిక.. ఈ టూర్‌కు వెళ్లాలనుకొనేవారికి పాస్‌పోర్టు తప్పనిసరిగా ఉండాలి. అలాగే వీసా కోసం పలు డాక్యుమెంట్లు అవసరమవుతాయి. ఇక ఈ ప్యాకేజీల్లో పర్యటనకు అయ్యే ఖర్చు, హోటల్స్, భోజనాలు, వివిధ ప్రాంతాల్లో ఎంట్రీ ఫీజులు వర్తిస్తాయి. మరోవైపు ఎయిర్ పోర్టులో పలు ట్యాక్స్‌లు, ఎంపిక చేసుకున్న భోజనానికి అయ్యే ఖర్చులు మాత్రం పర్యాటకులే భరించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
విహార యాత్రకు వెళ్లాలనుకునే వారికి.. ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్
కోడిగుడ్డు మంచిదా? పాడైందా? ఎలా తెలుసుకోవాలి.. ఇవిగో చిట్కాలు..
For More Lifestyle News And Telugu News