IRCTC New Tour Packages: విహార యాత్రకు వెళ్లాలనుకునే వారికి.. ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:19 PM
విదేశీ విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి మలేషియా, సింగపూర్ వెళ్లానుకునే పర్యాటకుల కోసం ప్యాకేజీను ఐఆర్‌సీటీసీ తీసుకు వచ్చింది.
విదేశీ విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి మలేషియా, సింగపూర్ వెళ్లానుకునే పర్యాటకుల కోసం ఈ ప్యాకేజీలను ఐఆర్‌సీటీసీ తీసుకు వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.
వివరాలు ఇలా..
డిసెంబర్ 11వ తేదీ ఈ టూర్ ప్రారంభమవుతుంది. మలేషియా, సింగపూర్‌లోని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి.. తిరిగి డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్ వస్తారు. అంటే.. 5 రాత్రులు, 6 పగళ్లు ఈ టూర్ సాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ. 1. 29 లక్షల నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది.
డిసెంబర్ 11వ తేదీ రాత్రి 11.10 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్సాల్సి ఉంటుంది.
మొదటి రోజు..
ఉదయం 8.10 గంటలకు మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. అనంతరం స్థానిక హోటల్‌లో దిగి.. ఆ రోజు మధ్యాహ్నం వరకు అక్కడ విశ్రాంతి తీసుకోవాలి. భోజనం అనంతరం ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాన్యుమెంట్, పెట్రోనస్ ట్విన్ టవర్ తదితర పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఆ తర్వాత రెస్టారెంట్‌కు తిరిగి చేరుకుని.. భోజనం చేసి ఆ రాత్రి అక్కడే ఉండిపోవాలి.
రెండో రోజు..
ఉదయం బటు గుహలు, మధ్యాహ్నం జెంటింగ్ హైల్యాండ్స్‌కి తీసుకువెళ్తారు. ఆ రాత్రికి తిరిగి హోటల్ చేరుకుని.. అక్కడే బస చేయాల్సి ఉంటుంది.
మూడో రోజు..
ఉదయం పుత్రజయకు వెళ్లి.. అక్కడ చూడాల్సిన ప్రాంతాల్ని వీక్షించాలి. స్థానిక హోటల్‌లో భోజనం చేయాలి. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సింగపూర్ తీసుకు వెళ్తారు. అక్కడ హోటల్‌లో రాత్రి బస చేయాల్సి ఉంటుంది.
నాలుగో రోజు..
ఉదయం ఆర్కిడ్ గార్డెన్, మెర్లియన్ పార్క్, సింగపూర్ ప్లయర్ రైడ్ చూసి.. స్థానిక భారతీయుల రెస్టారెంట్‌లో భోజనం చేయాలి. అనంతరం కేబుల్ కారు ఎక్కించి సెంటోసాకి తీసుకెళ్తారు. అక్కడ మేడమ్ టూస్సాడ్స్, ఐవోఎస్, వింగ్ ఆఫ్ టైమ్ ఫస్ట్ షో చూడవచ్చు. ఆ తర్వాత తిరిగి హోటల్ చేరుకుంటారు.
ఐదో రోజు..
ఉదయం యూనివర్సల్ స్టూడియోస్‌లో పర్యటించడం.. మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. అనంతరం గార్డెన్స్ బై ది బే, డోమ్స్ చూసి తిరిగి హోటల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.
ఆరో రోజు..
ఉదయం బర్డ్ ప్యారడైజ్‌ను సందర్శించవచ్చు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్థానిక మార్కెట్‌లో షాపింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. రాత్రి 8 గంటలకు సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కితే.. రాత్రి 9.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
కీలక సూచన..
ఈ విహారయాత్రకు వెళ్లాలనుకొనేవారికి పాస్‌పోర్టు తప్పని సరిగా ఉండాలి. అలాగే వీసా కోసం పలు డాక్యుమెంట్లు అవసరమవుతాయి. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ధనవంతులు కావాలనుకుంటే.. ఇవిగో సింపుల్ చిట్కాలు..
కోడిగుడ్డు మంచిదా? పాడైందా? ఎలా తెలుసుకోవాలి.. ఇవిగో చిట్కాలు..
For More Lifestyle News And Telugu News