Dussehra From Hyderabad Tour: దసరా సెలవుల స్పెషల్ ట్రిప్.. ప్రకృతి ఒడిలో విహారయాత్ర
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:57 PM
నగర జీవితంలో ట్రాఫిక్ జామ్‌లు, మాల్స్ హడావిడి, మొబైల్ స్క్రీన్‌లతో గందరగోళంతో ఉన్నారా. ఈ దసరా సెలవుల్లో ప్రకృతి ఒడిలోకి చేరుకుని ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. అందుకోసం హైదరాబాద్ నుంచి 5 గంటల దూరంలో చక్కటి ప్లేస్ ఉంది. అది ఏంటి, ఎలా వెళ్లాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
నిత్యం నగరంలో ట్రాఫిక్, మాల్స్‌లో హడావుడి, మొబైల్ స్క్రీన్‌ల్లో నిమగ్నమై బిజీగా మారిన జీవితం నుంచి బ్రేక్ తీసుకుని ప్రకృతి వైపు వెళ్లాలనిపిస్తుందా. ఈ దసరా సెలవుల్లో మీరు అలా ఎంజాయ్ చేసేందుకు ఓ చక్కటి ప్లేస్ ఉంది. అదే ఏటూరునాగారం (Eturnagaram) వైల్డ్ లైఫ్ శాంక్చురీ. హైదరాబాద్ (Hyderabad) నుంచి దాదాపు 5 గంటల ప్రయాణంలో అందమైన అడవులు, జంతు జాతుల రక్షణ స్థలం మీకు ఆహ్వానం పలుకుతోంది.
ఇక్కడ నెమళ్లు, చిరుతపులుల అరుపులతో జంగిల్ ఫారెస్ట్, విహంగ దృశ్యాలు సహా అనేక ఆసక్తికరమైన అనుభవాలను మీరు ఆస్వాదించవచ్చు. ప్రకృతి ప్రేమికులకు, అడవి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. అయితే ఈ టూరిస్టు ప్రాంతానికి ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చు అవుతుందనే తదితర విషయాలను ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ నుంచి ప్రయాణం ఎలా?
హైదరాబాద్ నుంచి ఏటూరునాగారం దూరం దాదాపు 250 కిలోమీటర్లు. ప్రయాణం టైం సుమారుగా 5–6 గంటలలోపు. మీరు ఈ ప్రయాణాన్ని తక్కువ బడ్జెట్‌లో లేదా సౌకర్యంగా ప్లాన్ చేసుకోవచ్చు
కారులో కూడా స్వేచ్ఛగా ఎక్కడైనా ఆగుకుంటూ వెళ్లవచ్చు
TSRTC బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి
లేదంటే వరంగల్ లేదా కాజీపేట వరకు రైలు మార్గంలో వెళ్లి, అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్సులో 110 కిమీ ప్రయాణించవచ్చు
కానీ ఒక రాత్రి అక్కడే ఉంటే అడవి అందాలను నెమ్మదిగా ఆస్వాదించవచ్చు
అడవిలోకి ఎంట్రీ వివరాలు
సమయాలు: ఉదయం 8:00 నుంచి సాయంత్రం 5:00 వరకు
ఎంట్రీ ఫీజు: పెద్దలకి రూ.10, పిల్లలకి రూ.5
గైడ్, వాహనాలకు అదనపు ఛార్జీలు ఉంటాయి
అడవిలో ఏమేమి చూడవచ్చు
ఈ అడవిలో టేకు చెట్లు, బాంబూ గుట్టలు, అలాగే దయ్యం వాగు. అడవిలో కనిపించే కొన్ని ప్రధాన జంతువులు. పులులు, చిరుతపులులు, బేర్లు, జింకలు, అడవి పంది, నక్కలు వంటివి ఉంటాయి. దీంతోపాటు 200కి పైగా పక్షుల జాతులు అక్కడ కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి