Share News

Best Places To Visit In India: ఈ మాసంలో దేశంలో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలు..

ABN , Publish Date - Nov 02 , 2025 | 06:50 PM

శీతాకాలం ప్రారంభమైంది. నవంబర్ మాసంలో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రకృతి ప్రేమికులు ప్లాన్ చేసుకుంటారు. వారిని కట్టిపడేసే ప్రాంతాలు దేశంలోని చాలానే ఉన్నాయి.

Best Places To Visit In India: ఈ మాసంలో దేశంలో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలు..

న్యూఢిల్లీ: వర్ష కాలం వెళ్లి పోయింది. చలి కాలం ప్రారంభమైంది. దీంతో నవంబర్ మాసంలో చలి రోజురోజుకు పెరుగుతుంది. ఈ చలి కాలం.. వచ్చే ఏడాది శివరాత్రి వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో టూర్ వెళ్లేందుకు పలువురు ప్లాన్ చేసుకుంటారు. అదీకాక.. నవంబర్‌లో దేశంలోని కొండ ప్రాంతాలు పచ్చ పచ్చని అందాలతో కొత్త శోభను సంతరించుకొంటాయి. దీనికి తోడి చలి సైతం తోడు కావడంతో.. పొగమంచు చిక్కగా మారుతుంది. దాంతో ఆ ప్రాంతాల ఆకర్షణ రెట్టింపవుతుంది. ఆ క్రమంలో మంచి హిల్ స్టేషన్లు, బీచ్‌లు.. ఎక్కడ ఉన్నాయంటూ గూగుల్‌ను ఆశ్రయించి ప్రకృతి ప్రేమికులు జల్లెడ పడతారు. అలాంటి వారి కోసం ..


మనాలి..

నవంబర్ మాసంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మానాలిలో అందాల ప్రకృతి దర్శనమిస్తుంది. మంచుతో కప్ప బడిన పైన్ చెట్లు.. వేడి వేడి కాఫీ అందించే కేఫ్‌లు ఈ ప్రాంతంలో ఉంటాయి. మనాలిలో ఎండ వచ్చి రానట్లుగా ఉంటుంది. అలాగే ఆపిల్ కాయలు నిండిన చెట్లతో తోటలు అందంగా ఉంటాయి. సోలాంగ్ వ్యాలీలో స్కీయింగ్ చేయడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. మనాలిలో షాపింగ్ సైతం మరిచిపోలేని విధంగా ఉంటుంది.


డార్జిలింగ్..

పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ ప్రాంతం నిండైన ప్రకృతికి ప్రతీకగా దర్శనమిస్తుంది. ఈ మాసంలో ఈ ప్రాంతం ఉదయం చాలా చల్లగా.. పొగమంచుతో నిండి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతం తేయాకుకు ప్రసిద్ధి. ఇక్కడి వేడి వేడి టీని ఆస్వాదించడం గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. ఈ మాసంలో శీతాకాలం వేళ.. కాంచన్‌జంగ్ మీద నుంచి సూర్యుడు ఉదయించడం జీవితంలో మరువలేని విధంగా ఉంటుంది. ఇక ఇక్కడి కొండ లోయలతోపాటు గుహాల మార్గం ద్వారా టాయ్ రైలు ప్రయాణం.. పొగమంచును చీల్చుకొంటు వెళ్తున్నట్లుగా ఉంటుంది. డార్జిలింగ్‌లో విహారాన్ని మధురానుభూతిని ఇస్తుంది.


ఊటీ..

తమిళనాడులోని ఊటీ.. చల్లని వాతావరణంతోపాటు పచ్చని గ్రామీణ ప్రాంతాల కలయిక. ఇక్కడి భారీగా పెరిగిన యూకలిప్టస్ చెట్లతోపాటు టీ ఎస్టేట్‌లు ఉంటాయి. ఆ ఆందాలు వీక్షించేందుకు రెండు కళ్లు చాలవు. ఇక ఊటీ సరస్సులో పడవ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.


నవంబర్‌లో బీచ్‌లు..

గోవా..

గోవాలో బీచ్‌లు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో బీచ్‌లు బంగారు వర్ణంతో దగదగ మెరుస్తాయి. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి గోవాకు పర్యాటకులు తరలి వస్తారు. నిత్యం పర్యాటకులతో ఈ ప్రాంతం నిత్యం నిండిపోయి ఉంటుంది.


గోకర్ణ..

కర్ణాటకలోకి గోకర్ణ.. సముద్రం ఒడ్డున ఉంటుంది. ఇక్కడ కుడ్లే, ఓం బీచ్‌లు అందంగా ఉంటాయి. ఇక్కడికి సైతం ప్రకృతి ప్రేమికులు పోటెత్తుతారు.


వర్కల..

కేరళలోని వర్కల.. ఒక వైపు కొండలు, మరోవైపు అరేబియా సముద్రం. ఈ ప్రాంతంలోని కేప్‌లు, ఆయుర్వేద మసాజ్‌ కేంద్రాలు ఇక్కడ ఉంటాయి. ఇక సూర్యాస్తమయాు.. గులాబీ రంగులో కొత్త శోభను సంతరించుకొంటాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ..

శీతాకాలంలో టూర్‌కు వెళ్లాలనుకుంటున్నారా.. ఇవిగో..

For More prathyekam and Telugu News

Updated Date - Nov 02 , 2025 | 06:50 PM