Share News

Top Winter Tourist Destinations in India: శీతాకాలంలో టూర్‌కు వెళ్లాలనుకుంటున్నారా.. ఇవిగో..

ABN , Publish Date - Oct 29 , 2025 | 04:38 PM

భారతదేశంలోని ప్రముఖ శీతాకాల పర్యాటక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాల్లో పర్యటించాలి. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రాంతాల్లో పర్యటన.. మనస్సుపై చెరగని ముద్ర వేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Top Winter Tourist Destinations in India: శీతాకాలంలో టూర్‌కు వెళ్లాలనుకుంటున్నారా.. ఇవిగో..

వర్షా కాలం వెళ్లిపోయింది. శీతాకాలం ప్రారంభమైంది. ఈ సమయంలో వివిధ ప్రాంతాల్లో ప్రకృతి పచ్చని రంగును పులుముకొని ఆహ్లాదకరంగా ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మరి ముఖ్యంగా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపిస్తాయి. ఈ ప్రకృతి రమణీయత మన మనస్సుకు హాయితోపాటు ఆహ్లాదాన్ని సైతం ఇస్తుంది. ఈ ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా స్కీయింగ్, ట్రెక్కింగ్ సైతం చేయవచ్చు. ఈ శీతాకాలంలో ప్రకృతిని ఆస్వాదించేందుకు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఐదు ప్రాంతాలు ఉన్నాయి. అవేంటంటే ..


Manali.jpg

మనాలి..

హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి. ఈ ప్రాంతంలో పర్వతాలను నిత్యం మంచు దుప్పటి కప్పి ఉంటాయి. అంతే కాదు ఈ ప్రాంతంలోని నదుల సైతం ఘనీభవించి ఉంటాయి. స్థానిక సోలింగ్ వ్యాలీలో స్కీయింగ్, స్నోబోర్డింగ్, పారాగ్లైడింగ్ వరకు సాహస క్రీడలు నిర్వహిస్తారు. రోహితాంగ్ పాస్ తెరిచి ఉంటే.. ఈ మార్గంలో ప్రయాణించడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. అందుకోసం ముందుగా అనుమతి పొందాల్సి ఉంటుంది. మనాలిలోని ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదించేందుకు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో మనాలి పర్యటనకు వెళ్ల వచ్చు.


winter.jpg

ఔలి..

ఉత్తరాఖండ్‌లోని ఔలి. దీనిని భారతదేశం స్కీయింగ్ రాజధానిగా పిలుస్తారు. ఇంకా చెప్పాలంటే.. సాహస ప్రియులకు స్వర్గధామమని అభివర్ణిస్తారు. ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తైన శిఖరాలు.. నందా దేవి, త్రిశూల్ ఉన్నాయి. ఈ పట్టణంలో స్కీయింగ్, కేబుల్ కార్ రైడ్లు, మంచు ట్రెక్కింగ్ .. సాహసంతో చేసేందుకు ఔత్సాహికులు ఇక్కడికి భారీగా తరలి వస్తారు. తెల్లని మంచుతో ఇక్కడి హిమాలయాలు కప్పి ఉంటాయి. ఇవి అత్యంత రమణీయంగా ఉంటాయి. డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఈ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తుతారు.


Gulmarg.jpg

గుల్మార్గ్..

జమ్మూ కశ్మీర్‌లోని గుల్మార్గ్. శీతాకాలంలో ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఉన్న అత్యంత అందమైన ప్రాంతాల్లో ఇది ఒక్కటి. స్కీయింగ్ రిసార్ట్‌లు, స్నోబోర్డింగ్‌లతోపాటు కేబుల్ కార్లకు గుల్మార్గ్ గొండోలా ప్రసిద్ధి గాంచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్లు నడిచే ప్రాంతంగా ఖ్యాతి పొందింది. ప్రపంచవ్యాప్తంగా సాహస యాత్రలు చేయాలనుకునే వారు.. ఈ ప్రాంతానికి తరలి వస్తారు. ఇక్కడి పైన్ అడువులు అత్యంత రమణీయంగా కనువిందు చేస్తాయి. అంతే కాకుండా ఈ ప్రాంతం ప్రశాంతమైన ప్రకృతికి మారు పేరు గాంచింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య.. గుల్మార్గ్‌లో ప్రయాణం అత్యంత అనుకూలం.


Leh.jpg

లేహ్..

జమ్మూ కశ్మీర్‌లోని లడాఖ్‌లో లేహ్ నగరం. శీతాకాలంలో ఈ నగరం సరికొత్త శోభను సంతరించుకొంటుంది. ఈ కాలంలో వాతావరణం బాగా తగ్గిపోతుంది. అది కూడా ఎంతగా అంటే.. ఘనీభవన స్థితి కంటే కూడా బాగా తగ్గుతుంది. సాహసాలను కోరుకునే వారికి ఈ లెహ్ ఒక అద్భుతమని చెప్పాలి. ఘనీభవించిన జాంస్కర్ నదిపై చాదర్ ట్రెక్ అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. ట్రెక్కింగ్, బైకింగ్, స్నో క్యాంపింగ్ కోసం పర్యాటకులు ఈ నగరానికి పోటెత్తుతారు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు చాదర్ ట్రెక్ చేసేందుకు అత్యంత అనువైన సమయం.


tawang.jpg

తవాంగ్..

శీతాకాలంలో సాహసయాత్ర చేయాలంటే మాత్రం.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ పట్టణం వెళ్లాల్సిందే. ఇక్కడ మఠాలు మంచుతో కప్పబడి ఉంటాయి. అలాగే సరస్సులు ఘనీభవించి ఉంటాయి. పర్వతారోహణకు ప్రసిద్ధి చెందిన అద్భుతమైన హిమాలయ పట్టణం ఇది. ఇక్కడి సెలా పాస్ అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ప్రకృతి సౌందర్యంతోపాటు ట్రెక్కింగ్, క్యాంపింగ్, ఐస్ స్కేటింగ్ ఆస్వాదించాలంటే మాత్రం ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌కు తరలి వెళ్లాల్సిందే. నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ తవాంగ్ పట్టణంలో పర్యటించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ శీతాకాలంలో ఈ ప్రాంతాల్లో పర్యటిస్తే.. ఆ పర్యాటకుల మదిలో శాశ్వతమైన ముద్ర పడిపోతుంది. ఈ ఐదు ప్రాంతాల్లో పర్యటించాలనుకునే వారు ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి మరి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఓట్ల కోసం ఆయన డాన్స్ కూడా చేస్తారు... రాహుల్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ

తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...

For More prathyekam and Telugu News

Updated Date - Oct 29 , 2025 | 05:21 PM