Share News

Jyotirling Tour Package: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ..

ABN , Publish Date - Oct 31 , 2025 | 06:52 PM

కార్తీక మాసంలో భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. వీరందరి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Jyotirling Tour Package: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ..

కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. వీరి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలో భక్తులకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా దేశంలోని అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలను సందర్శించే అవకాశం కల్పిస్తుంది. అందులో ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని, షిర్డీలోని సాయిబాబా ఆలయాన్నిసైతం భారత్ దర్శన్ 2025 టూర్ జాబితాలో చేర్చింది.


జ్యోతిర్లింగ పర్యటన ఎంచుకున్న మార్గాన్ని బట్టి 8 నుంచి 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పర్యటన ఢిల్లీ, వారణాసి, లక్నో హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఈ పర్యటనలో కవర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో బుకింగ్ సమయంలో బయలుదేరే బోర్డింగ్ పాయింట్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది.


ఈ టూర్ ప్యాకేజీలో.. సోమనాథ్, శ్రీశైలం మల్లికార్జున, ఉజ్జయినీ మహాకాళేశ్వర్, మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్, బైద్యనాథ్, గుజారత్ నాగేశ్వర్, కేదారేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్, రామేశ్వర్, మహారాష్ట్ర భీమేశ్వర్, కాశీ విశ్వనాథ, ఔరంగాబాద్ గృష్ణేశ్వర్ ఇలా మొత్తం జ్యోతిర్లింగాలతోపాటు షిర్డీ సాయి బాబా దేవాలయాన్ని దర్శించుకోవచ్చు.


ఇక ఐఆర్‌సీటీసీ జ్యోతిర్లింగ టూర్ 2025 ద్వారా ఒక్కొక్కరికి రూ.10,500 నుంచి రూ.12,000 వరకు టికెట్ ధర ఉంటుంది. ఇందులో స్లీపర్ క్లాస్ రైలు బోగీలు ఉంటాయి. ఈ పర్యటన సమయంలో శాఖాహార భోజనం, నాన్ ఏసీ వసతి గృహాలు లేదా హాళ్లలో వసతి, కల్పిస్తారు.


అలాగే ఈ పర్యటనలో స్థలాలు చేరుకోవడానికి బస్సు చార్జీలు, టూర్ ఎస్కార్టులు, భద్రత, ప్రయాణ బీమా లభిస్తాయి. టికెట్ బుకింగ్ కోసం అధికారిక ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చు. అందుకోసం www.irctctourism.com ని సందర్శించాలి. లేకుంటే టికెట్ బుకింగ్‌ను అధీకృత IRCTC ఏజెంట్లు లేదా ప్రాంతీయ పర్యాటక కార్యాలయాల ద్వారా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

కార్తీకంలో ఏకాదశి.. మహావిష్ణువుకు పూజలు ఎందుకంటే.. ?

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

Updated Date - Oct 31 , 2025 | 08:26 PM