Share News

Sitaphal For Diabetes: షుగర్ పేషెంట్స్ సీతాఫలం తింటే ఏం అవుతుందో తెలుసా..?

ABN , Publish Date - Oct 12 , 2025 | 09:20 AM

సీతాఫలంను కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎలర్జీతో బాధపడేవాళ్లు సీతాఫలం తిన్న వెంటనే చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు కనిపించవచ్చు.

Sitaphal For Diabetes: షుగర్ పేషెంట్స్ సీతాఫలం తింటే ఏం అవుతుందో తెలుసా..?

ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలం అంటే అందరికి గుర్తొచ్చేది సీతాఫలం. సీతాఫలం అనేక పోషకాలతో నిండిన ఒక రుచికరమైన చలికాలపు పండు. ఇది గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో లభించే ఈ పండు, ఆరోగ్యంగా ఉండటానికి, బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. దీన్ని కస్టర్డ్‌ యాపిల్‌ అని, షుగర్‌ యాపిల్‌ అని పిలుస్తారు. గ్రామాలు, పల్లెలు, అడవుల్లో ఎక్కడబడితే అక్కడ కనిపిస్తుంటాయి. ఈ పండ్లు శీతాకాలంలో ఎక్కువగా లభ్యం అవుతుంటాయి.


సీతాఫలంను కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎలర్జీతో బాధపడేవాళ్లు సీతాఫలం తిన్న వెంటనే చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు కనిపించవచ్చు. అలాగే మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినకూడదని అంటుంటారు. కాగా, డయాబెటిస్ పేషెంట్లు సీతాఫలను ఎలాంటి భయం లేకుండా తినొచ్చని వైద్యులు తెలుపుతున్నారు. డయాబెటిస్‌ ఉన్నవాళ్లు మితంగా ఈ పండుని తినొచ్చని వైద్యులు అంటున్నారు. ఇది ఇన్‌ ఫ్లమేషన్‌ తగ్గించి, గుండెకి మేలు చేస్తుందని వివరిస్తున్నారు. ఇక సీతాఫలం తింటే జలుబు చేస్తుందని చాలామందికి అపోహ ఉంటుంది. కానీ ఈ పండును తింటే ఎలాంటి జలుబు చేయదని వైద్యులు వెల్లడిస్తున్నారు.


ఈ సీతాఫలంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా రక్తహీనతతో బాధపడుతున్న రోగులకు సీతాఫలాన్ని తినమని వైద్యులు సిఫార్సు చేస్తారు. అంతేకాక ఇది అలసటను దూరం చేస్తుంది. మెదడులోని ఒత్తిడి స్థాయిలను నియంత్రించడంతోపాటు పార్కిన్సన్స్, క్షీణించిన మెదడు రుగ్మత నుంచి ఈ పండ్లు రక్షిస్తాయని చెబుతున్నారు. అలగే సీతాఫలంలోని పీచు పదార్థం శరీరంలోని టాక్సిన్స్‌ ను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది. అసిడిటీ, పొట్టలో పుండ్లు వంటి కడుపు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుందని వైద్యులు పేర్కొన్నారు. అయితే.. శీతాకాలంలో సీతాఫలం డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇదే అదునుగా వ్యాపారస్తులు కూడా అధిక ధరకు పండ్లను విక్రయిస్తుంటారు.


ఇవి కూడా చదవండి..

Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు

Updated Date - Oct 12 , 2025 | 09:46 AM