Share News

Chanakya Niti for Success: ఉదయాన్నే ఈ పనులు చేయకపోతే జీవితంలో సక్సెస్ కాలేరు..

ABN , Publish Date - Aug 31 , 2025 | 02:29 PM

జీవితంలో అందరూ విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ చాలా మందికి విజయం సాధించడానికి, వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎలా ప్లాన్ చేయాలో తెలియదు. అలాంటి వారికోసమే ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో విజయం సాధించడానికి ఏమి చేయాలో స్పష్టంగా చెప్పాడు. మీరు కూడా విజేతలుగా నిలవాలంటే ఉదయం దినచర్యలో ఈ పనులను అలవాటు చేసుకోండి.

Chanakya Niti for Success: ఉదయాన్నే ఈ పనులు చేయకపోతే జీవితంలో సక్సెస్ కాలేరు..
Chanakya Adivces for Success

దినచర్య ప్రశాంతంగా ప్రారంభిస్తే మనం రోజంతా సానుకూలంగా ఉండగలం. అనుకున్న అన్ని పనులు పూర్తిచేయగలం. ఏ పనిలో అయినా వందశాతం విజయం సాధించాలనే కోరిక నెరవేరాలంటే రాత్రి త్వరగా పనులు ముగించుకుని నిద్రపోవాలని.. వేకువజామునే నిద్రమేల్కొవాలని పెద్దలు చెబుతార. ఎందుకంటే, ఆ కాస్త సమయం చాలా విలువైనది. దానిని వృథా చేయకూడదు. ముఖ్యంగా ఏ పనిలో అయినా విజయం సాధించాలనుకునేవారు. జీవితంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుని సమాజంలో గొప్పవారిగా స్థానం సంపాదించిన ప్రతి విజేత ఉదయపు దినచర్యలో ఈ కింది అలవాట్లు తప్పక ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని చాణక్యుడు ఏనాడో నీతిశాస్త్రంలో వివరించాడు. ఇంతకీ, ఆ అలవాట్లేంటో చూద్దాం.


విజేతల ఉదయపు అలవాట్లు ఇవే:

  • ఉదయం త్వరగా నిద్ర లేవడం: ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా నిద్ర లేవడం ఆరోగ్యానికి, కెరీర్‌కు హానికరం. త్వరగా నిద్రపోవడం, త్వరగా నిద్ర లేవడం విజయానికి మొదటి మెట్లు అని చాణక్యుడు చెప్పాడు. ఉదయం త్వరగా నిద్ర లేవడం వల్ల పని సమయానికి పూర్తి చేయడం సాధ్యమవుతుంది. త్వరగా నిద్ర లేవడం వల్ల జడత్వం అనే భావన కూడా తొలగిపోతుంది. మీరు రోజంతా ఉత్సాహంగా, సానుకూలంగా ఉండవచ్చు.

  • ప్రణాళికలు రూపొందించడం: చాణక్యుడి ప్రకారం, ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు మీ రోజును ప్లాన్ చేసుకోవాలి. తన రోజును ప్లాన్ చేసుకునే వ్యక్తి లక్ష్యాలను సాధించడంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోకపోవచ్చు. ప్రణాళికలు రూపొందించడం ద్వారా అతడు నిర్దేశించిన పనిని పూర్తి చేయడం సులభం అవుతుందని చాణక్యుడు చెప్పాడు.


  • సమయ నిర్వహణ: సమయం చాలా విలువైనది. కాబట్టి దానిని తెలివిగా ఉపయోగించుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం మీరు అన్ని పనులను సమయానికి పూర్తి చేయాలి. ఏ పనిని రేపటికి వాయిదా వేయకూడదు. ఇలా చేయడం ద్వారా ఏ వ్యక్తీ విజయం సాధించలేడు.

  • ఆరోగ్య సంరక్షణ: ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ రాజీ పడవద్దని చాణక్యుడు చెబుతున్నాడు, ఎందుకంటే మనం మన ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉంటే వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. మనం అనారోగ్యానికి గురైతే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించలేము. శరీరంలో బలం, శక్తి ఉన్నప్పుడే విజయం సాధించగలరు. కాబట్టి యోగా చేయాలి, ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఈ ఆరోగ్యకరమైన అలవాట్లన్నీ కచ్చితంగా విజయం సాధించడంలో మీకు సహాయపడతాయి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

ఇవి కూడా చదవండి:

7 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయేవారికి షాకింగ్

ఆయుర్వేదం ప్రకారం ఈ టైంలో పాలు, పెరుగు తీసుకుంటే అనారోగ్యానికి గురికారు..!

Read Latest and Health News

Updated Date - Aug 31 , 2025 | 02:44 PM