Share News

Bunyan Un Marsoos: చావు దెబ్బ తిన్నా బుద్ధిరాలేదు.. కొత్త ఎత్తుగడ వేసిన పాక్..

ABN , Publish Date - May 10 , 2025 | 03:03 PM

Operation Bunyan Un Marsoos: 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతీకారంగా వరస దాడులకు యత్నించి భారత ఆర్మీ చేతిలో చావు దెబ్బ తింది పాక్. ఇప్పటికే ఆర్థికంగా అథఃపాతాళంలో కూరుకుపోయింది. రేపో మాపో చేతులెత్తేస్తుందని అంతా అనుకుంటుంటే.. ప్రెస్ మీట్ పెట్టి మరీ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన చేశారు.

Bunyan Un Marsoos: చావు దెబ్బ తిన్నా బుద్ధిరాలేదు.. కొత్త ఎత్తుగడ వేసిన పాక్..
What is Operation Bunyan Un Marsoos

Operation Bunyan Un Marsoos Meaning: 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) పేరిట భారత త్రివిధ దళాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని ఉగ్రస్థావరాలను తునాతునకలు చేసినప్పటి నుంచి మరింత రెచ్చిపోతోంది దాయాది దేశం. మా లక్ష్యం కేవలం ఉగ్రవాదులే.. పౌరులు కాదని భారత్ పదే పదే స్పష్టం చేస్తున్నా దొంగచాటుగా దెబ్బతీసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా రాత్రి సమయాల్లోనే సరిహద్దుల్లోని పౌరులపై డ్రోన్ దాడులు, క్షిపణులు వదులుతోంది. భారత సైన్యం సమర్థంగా ఈ దాడులను తిప్పికొడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు పాకిస్థాన్ సేనలకు. భారత్ ఓ పక్క రహిమ్యార్ సహా కీలక ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేస్తున్నా శత్రుదేశానికి బుద్ధి రావడం లేదు. అతి క్రూరమైన ఉగ్రవాదుల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సొంత పౌరుల శ్రేయస్సునే పణంగా పెట్టేందుకు సిద్ధమైంది.


దాడులు మరింత పెంచుతాం..

ఇండియాతో రెండు రోజుల పోరుకే ఆర్థికంగా బిక్కచచ్చిపోయిన పాకిస్థాన్.. ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం యాచిస్తోంది. మరో పక్కేమో చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా భారత్ అంతు చూసే వరకూ ఊరుకోమని బీరాలు పలుకుతోంది. అందుకు ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన ప్రకటనే నిదర్శనం. 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతీకారంగా భారత్‌పై పూర్తి స్థాయిలో ' బున్యాన్ ఉన్ మర్సూస్' పేరుతో మిలటరీ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించాడు. ఇకపై దాడుల తీవ్రత మరింత పెంచుతామని ప్రకటించాడు. భారత సేనల దాడులను తట్టుకుని నిలబడి సీసపు పునాది ఉన్న దృఢమైన భవనంలా ఉంటామనే ఉద్దేశంతో ఖురాన్ నుంచి 'బున్యాన్-ఉల్-మర్సూస్' అనే పేరు ఎంచుకున్నట్లు తెలిపాడు. ఈ యుద్ధానికి బలమైన పునాది ఉగ్రవాదులేనని చెప్పకనే చెపుతోంది దాయాది దేశం.


ఉగ్రవాదుల మరణంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్న పాక్ నేతలు, ఆర్మీ సొంత ప్రజలకు తిండి పెట్టడానికి డబ్బు లేకపోయినా.. అప్పు తీసుకుని అయినా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండు రోజులుగా భారతదేశంపై ఎడతెగకుండా రెచ్చగొట్టే చర్యలు చేపడుతోంది. 'ఆపరేషన్ బున్యాన్-ఉన్-మర్సూస్' పేరుతో భారతదేశంలోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు పాల్పడుతోంది. సరిహద్దు అవతల నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను భారతదేశ బలమైన వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేయడంతో పాక్ సేనలకు పిచ్చెత్తినట్లవుతోంది. అయితే, దాయాది సైనికులు జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాలలో కొంతమంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్నారు.


Read Also: BLA Attack: బీఎల్‌ఏ మెరుపు దాడులు.. పాక్ ఉక్కిరిబిక్కిరి
Earthquake In Pakistan: పాకిస్థాన్‌లో భారీ భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

Pahalgam Terror Attack: పాకిస్తాన్‌కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన..

Updated Date - May 10 , 2025 | 04:11 PM