Share News

US to Review Visas: అమెరికాలో 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన

ABN , Publish Date - Aug 23 , 2025 | 02:49 AM

అమెరికాలోని వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడ ఉంటున్న 5.5 కోట్ల మందికి పైగా విదేశీయుల వీసా పత్రాలను సమీక్షించనున్నట్లు ప్రకటించింది..

US to Review Visas: అమెరికాలో 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన

  • నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే దేశ బహిష్కరణ..

వాషింగ్టన్‌: అమెరికాలోని వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడ ఉంటున్న 5.5 కోట్ల మందికి పైగా విదేశీయుల వీసా పత్రాలను సమీక్షించనున్నట్లు ప్రకటించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే.. తక్షణమే వారి వీసా రద్దు చేసి అమెరికా నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికాలోని వీసాదారులందరిపై నిరంతర పరిశీలన ఉంటుందని.. వీసా జారీ తర్వాత వారి ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా.. వీసా రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించారా అనేది సమీక్షిస్తామని స్పష్టం చేసింది.

విదేశీ ట్రక్కు డ్రైవర్లకు అమెరికా వీసాల నిలిపివేత

విదేశీ వాణిజ్య ట్రక్కు డ్రైవర్లకు వర్కర్‌ వీసాల జారీని అమెరికా గురువారం నుంచి నిలిపివేసింది. ఇటీవల భారత్‌కు చెందిన ఓ సిక్కు ట్రక్కు డ్రైవర్‌ ఫ్లోరిడా హైవేపై నిర్లక్ష్యంగా యూటర్న్‌ తీసుకోవడం వల్ల ముగ్గురు అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ యంత్రాంగం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వీసాలను నిలిపివేశారు. దీంతో వీసా గడువు ముగిసిన వారికి రెన్యూవల్‌ చేసే అవకాశం ఉండదు. కొత్తగా వీసాల జారీ ఉండదు కాబట్టి భారత్‌ సహా విదేశీ ట్రక్కు డ్రైవర్లు అమెరికాకు వచ్చే ఆస్కారం ఉండదు. ఇంతకు ముందు విదేశీ ట్రక్కు డ్రైవర్లు హెచ్‌-2బీ వీసా వంటి తాత్కాలిక వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు.


ఇవి కూడా చదవండి..

చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు

వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

For More National News And Telugu News

Updated Date - Aug 23 , 2025 | 02:49 AM