Share News

Bolivia Road Accident: ఆ దేశంలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని.. బాబోయ్..

ABN , Publish Date - Mar 02 , 2025 | 07:49 AM

బొలీవియా: ఒరురో కార్నివాల్‌‌కు వెళ్తున్న బస్సులకు ఘోర ప్రమాదం జరిగింది. ఉయుని- కొల్చాని రహదారిపై ఒకదాన్ని మరొకటి బలంగా ఢీకొట్టడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.

Bolivia Road Accident: ఆ దేశంలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని.. బాబోయ్..
Bolivia Road Accident

బొలీవియా: బొలీవియా(Bolivia) దేశంలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) సంభవించింది. రెండు బస్సులు ఢీకొని 37 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. లాటిన్‌ అమెరికాలో జరుగుతున్న ఒరురో కార్నివాల్‌(Oruro carnival)కు బస్సులు వెళ్తుండగా ఉయుని- కొల్చాని రహదారిపై ఒకదాన్ని మరొకటి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతోనే ప్రాణనష్టం భారీగా జరిగినట్లు వెల్లడించింది.


మృతుల్లో మహిళలు, చిన్నారులు పదుల సంఖ్యలో ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది. మరోవైపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్లు ఇద్దరూ ప్రాణపాయం నుంచి తప్పించుకోగా.. ఓ డ్రైవర్ మాత్రం ఐసీయూలో చికిత్సపొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బొలీవియా పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Elon Musk: 14వ సారి తండ్రయిన మస్క్‌!

Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలు ఎంతకు పెరిగాయో తెలుసా..

Updated Date - Mar 02 , 2025 | 07:58 AM