Share News

Elon Musk: 14వ సారి తండ్రయిన మస్క్‌!

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:35 AM

మూడో బిడ్డ అర్కాడియా పుట్టిన రోజు సందర్భంగా... నాలుగో బిడ్డ సెల్డాన్‌ లైకుర్గస్‌ గురించి కూడా వెల్లడించడం మంచిదని ఇద్దరం భావించాం...’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు మస్క్‌ ‘హార్ట్‌ ఎమోజీ’ని పెట్టారు.

Elon Musk: 14వ సారి తండ్రయిన మస్క్‌!

న్యూరాలింక్‌ ఎగ్జిక్యూటివ్‌ శివోన్‌ జిలిస్‌ ద్వారా మగబిడ్డ

న్యూఢిల్లీ, మార్చి 1: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ 14వ సారి తండ్రి అయ్యారు. ఆయనకే చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ న్యూరా లింక్‌ ఎగ్జిక్యూటివ్‌ శివోన్‌ జిలిస్‌ ద్వారా నాలుగో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు. ‘‘దీనిపై ఎలాన్‌తో చర్చించాను... మా మూడో బిడ్డ అర్కాడియా పుట్టిన రోజు సందర్భంగా... నాలుగో బిడ్డ సెల్డాన్‌ లైకుర్గస్‌ గురించి కూడా వెల్లడించడం మంచిదని ఇద్దరం భావించాం...’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు మస్క్‌ ‘హార్ట్‌ ఎమోజీ’ని పెట్టారు. కాగా జిలిస్‌, మస్క్‌లకు తొలుత 2021లో కవల పిల్లలు స్ట్రైడర్‌, ఎజూర్‌ జన్మించారు.

మరోవైపు ఆయనకు ఇప్పటికే గాయని గ్రిమ్స్‌ ద్వారా ముగ్గురు పిల్లలు, మాజీ భార్య, రచయిత జస్టిన్‌ విల్సన్‌ ద్వారా ఆరుగురు పిల్లలు ఉన్నారు. విల్సన్‌కు పుట్టిన పిల్లల్లో ఒకరు బాల్యంలోనే మృతి చెందారు. ప్రస్తుతం మస్క్‌ శివోన్‌ జిలి్‌సతో సహజీవనం చేస్తున్నారు. కాగా కన్జర్వేటివ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆష్లే సెయింట్‌ క్లెయిర్‌ తాను మస్క్‌ ద్వారా ఓ బిడ్డను కన్నానని కొద్ది వారాల క్రితం పేర్కొనడం గమనార్హం. దీనిపై మస్క్‌ స్పందించలేదు.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2025 | 04:35 AM