Share News

Trump-Putin Meeting: ట్రంప్, పుతిన్ భేటీ వాయిదా.. ఎందుకంటే..?

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:16 AM

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో సమావేశం అవుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సమావేశం వాయిదా ప్రస్తుతానికి వాయిదా పడింది. మళ్లీ భవిష్యత్తులో ఈ సమావేశం జరుగుతుందనే అంశంపై స్పష్టత లేదని వైట్ హౌస్ వెల్లడించింది.

Trump-Putin Meeting: ట్రంప్, పుతిన్ భేటీ వాయిదా.. ఎందుకంటే..?

వాషింగ్టన్, అక్టోబర్ 22: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేయ లేదు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లు ద్వారా చర్చించుకున్నారు. అనంతరం ఈ ప్రకటన జారీ అయింది. ట్రంప్, పుతిన్‌ల మధ్య బుడాపెస్ట్‌లో సమావేశం జరగనుందంటూ గత వారం ఒక ప్రకటన వెలువడిన విషయం విదితమే.


అయితే ఈ సమావేశం నిలిచిపోయేందుకు స్పష్టమైన కారణాలు అయితే లేవని అమెరికా స్పష్టం చేసింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఉపయోగం లేని ఈ భేటీ ద్వారా సమయం వృధా చేసుకోవాలంటూ తనదైన శైలిలో ఆయన తెలిపారు. ఈ చర్చల వల్ల ఎలాంటి ఆశాజనక పరిణామాలు ఉండవని ట్రంప్ వెల్లడించారు. అయితే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొన్ని నెలలుగా సాగుతోంది.


దాంతో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణపై చర్చలకు ట్రంప్, పుతిన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వీరు మరికొద్ది రోజుల్లో బుడాపేస్ట్‌లో సమావేశం కావాల్సి ఉంది. ఇక వీరి భేటీపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సైతం స్పందించింది. భవిష్యత్తులో వీరి భేటీ సందేహమేనంటూ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ కాల్పుల విరమణకు ముందు ఉక్రెయిన్ మరిన్ని భూభాగాలను వదులుకోవడానికి అంగీకరించాలంటూ మాస్కో చాలా కాలంగా డిమాండ్ చేస్తోన్న విషయం విదితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం..

For More International News And Telugu News

Updated Date - Oct 22 , 2025 | 11:26 AM