Share News

Donald Trump Meloni: మీరు చాలా అందంగా ఉన్నారు.. ఇటలీ ప్రధానితో ట్రంప్

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:24 PM

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చాలా అందంగా ఉన్నారని, ఆమె అద్భుతమైన నాయకురాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. శాంతి ఒప్పందంపై సంతకాల నేపథ్యంలో ఈజిప్ట్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు.

Donald Trump Meloni: మీరు చాలా అందంగా ఉన్నారు.. ఇటలీ ప్రధానితో ట్రంప్
Trump calls Meloni beautiful

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చాలా అందంగా ఉన్నారని, ఆమె అద్భుతమైన నాయకురాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. శాంతి ఒప్పందంపై సంతకాల నేపథ్యంలో ఈజిప్ట్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. శాంతి ఒప్పందంపై సంతకం చేసేందుకు వచ్చిన మెలోనీపై ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా అందంగా ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు (Trump calls Meloni beautiful).


'మెలోనీ చాలా అందంగా ఉన్నారు. నాకు అలా చెప్పే అవకాశం లేదు. అమెరికాలో ఓ మహిళకు అలా చెబితే నా రాజకీయ జీవితం ముగుస్తుంది. కానీ, ఇప్పుడు నేను ఆ అవకాశం తీసుకుంటా. అందంగా ఉన్నారని చెబితే మీకు అభ్యంతరం లేదు కదా. ఎందుకంటే మీరు అలా ఉన్నారు' అని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలతో మెలోనీతో పాటు వేదికపై ఉన్న అందరూ చిరునవ్వులు చిందించారు (Giorgia Meloni Trump).


జార్జియా మెలోనీ అద్భుతమైన నాయకురాలని ట్రంప్ కొనియాడారు (Trump US culture). శాంతి ఒప్పందం కోస ఈజిప్ట్ వచ్చినందుకు మెలోనీకి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రంప్‌తో పాటు పలు దేశాల అధినేతలు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం

కొత్త డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్

దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?

For More National News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 04:24 PM