Share News

Donald Trump: మస్క్‌ను అమెరికా నుంచి పంపించేస్తాం!

ABN , Publish Date - Jul 02 , 2025 | 05:29 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రపంచ కుబేరుడు ఈలాన్‌ మస్క్‌ మధ్య భేదాభిప్రాయాలు మరింతగా ముదిరాయి. మరోసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు.

Donald Trump: మస్క్‌ను అమెరికా నుంచి పంపించేస్తాం!

  • ప్రభుత్వ సబ్సిడీలు లేకుంటే మస్క్‌ తన దుకాణం మూసుకోవాల్సిందే

  • తిరిగి దక్షిణాఫ్రికాకు పోవాల్సిందే

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలు

  • ‘సూటిగా చెబుతున్నా.. సబ్సిడీలు వెంటనే తొలగించండి’ అంటూ మస్క్‌ ప్రతి సవాల్‌

  • రిపబ్లికన్‌ పార్టీని పందుల పార్టీ అంటూ మండిపాటు.. కొత్త పార్టీ పెడతానని వెల్లడి

వాషింగ్టన్‌, జూలై 1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రపంచ కుబేరుడు ఈలాన్‌ మస్క్‌ మధ్య భేదాభిప్రాయాలు మరింతగా ముదిరాయి. మరోసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ‘‘చరిత్రలోనే ఎవరూ పొందలేనంతగా మస్క్‌ సబ్సిడీలు పొందుతున్నారు. ఈ సబ్సిడీలే లేకుంటే రాకెట్‌ ప్రయోగాలు ఉండవు, శాటిలైట్లు ఉండవు, ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తి ఉండదు. ఎలాన్‌ మస్క్‌ తన దుకాణం మూసుకుని సొంత ప్రాంతం దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. అమెరికాకు ఎంతో సంపద మిగులుతుంది’’ అని ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ‘ట్రూత్‌’లో పోస్టు పెట్టారు. ప్రభుత్వ ఖర్చులను నియంత్రించే ‘డోగె’ విభాగం ఎలాన్‌ మస్క్‌కు అందుతున్న సబ్సిడీల వ్యవహారంపై దృష్టిసారించాలని సూచించారు. ‘ట్రంప్‌ను దేశం నుంచి వెళ్లగొట్టే ఆలోచన ఏదైనా ఉందా?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘ఇప్పటికైతే తెలియదు.


కానీ ఈ అంశంపై మేం దృష్టిపెట్టాల్సి ఉంది’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. నిజానికి అమెరికా ప్రభుత్వ ఖర్చులను, సబ్సిడీలను తగ్గించేందుకు ఉద్దేశించిన ‘బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు’ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎలాన్‌ మస్క్‌.. దానికి మద్దతిచ్చే ప్రజాప్రతినిధుల పదవులు ఊడగొడతానని ఇంతకుముందే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఎలాన్‌ మస్క్‌ కంపెనీలు టెస్లా, స్పేస్‌ ఎక్స్‌లకు అందే సబ్సిడీల అంశాన్ని ట్రంప్‌ లేవనెత్తారు. దీనిపై ఎలాన్‌ మస్క్‌ గట్టిగానే సమాధానమిచ్చారు. ‘‘నేను సూటిగా చెబుతున్నాను. వెంటనే సబ్సిడీలన్నింటికీ కోత పెట్టేసుకోండి’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని మరోసారి ప్రకటించారు. ‘‘ఇప్పుడు మన దేశం ఏక పార్టీ పాలన ఉంది. అదో పందుల పార్టీ. ఇప్పుడు దేశంలో ప్రజా సంక్షేమాన్ని నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని మస్క్‌ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

ఉగ్రవాదులు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ రాష్ట్రం

వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్

బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..

For More Telangana News and Telugu News

Updated Date - Jul 02 , 2025 | 05:41 AM