Share News

Charlie Kirk Shot: అమెరికా రాజకీయాల్లో కలకలం..కాల్పుల్లో ట్రంప్ సన్నిహితుడు దుర్మరణం

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:39 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ (31) దారుణమైన కాల్పుల ఘటనలో మరణించారు. ఉటాహ్ వాలీ విశ్వవిద్యాలయంలో అమెరికన్ కమ్ బ్యాక్ టూర్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

Charlie Kirk Shot: అమెరికా రాజకీయాల్లో కలకలం..కాల్పుల్లో ట్రంప్ సన్నిహితుడు దుర్మరణం
Charlie Kirk Shot

అమెరికాలోని రాజకీయ వర్గాల్లో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన, రిపబ్లికన్ అభిమాని, టర్నింగ్ పాయింట్ USA కన్సర్వేటివ్ సంస్థకు సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చార్లీ కిర్క్ (వయసు 31) (charlie kirk) అనూహ్యంగా తుపాకీ కాల్పుల్లో మృతి చెందాడు.

అమెరికన్ కమ్‌బ్యాక్ టూర్ పేరిట ఉటాహ్ వాలీ విశ్వవిద్యాలయంలోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న క్రమంలో ఈ దారుణ ఘటన జరిగింది. చురుకైన రాజకీయ కార్యకర్తగా, అమెరికన్ యువతలో దేశభక్తిని రగిలించేందుకు విశేషంగా కృషి చేసిన చార్లీ, అమెరికా రాజకీయాల్లో ఎదుగుతుండగానే కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం అనేక మందిని కలచివేసింది.


ట్రంప్ రియాక్షన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చార్లీతో తనకున్న అనుబంధాన్ని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ వేదికగా పంచుకున్నారు. గొప్పవాడు, లెజెండరీ చార్లీ కిర్క్ ఇక లేడు. చార్లీ కిర్క్ ఒక నాయకుడు మాత్రమే కాదు. యువతకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. అతని మాటలు, ఆలోచనలు ఎప్పటికీ మనతో ఉంటాయి. అతని భార్య ఎరికా, కుటుంబానికి ఈ బాధను భరించే శక్తి దేవుడు ఇవ్వాలని కోరుకుందాం.


వైట్ హౌస్ కూడా..

చార్లీ మనల్ని విడిచి వెళ్లినా, అతని ఆశయాలు, పోరాటం ఎప్పటికీ జీవించే ఉంటాయన్నారు. ఈ సందర్భంగా చార్లీ భార్య ఎరికాకు, అతని కుటుంబానికి నా భార్య మెలానియాతో కలిసి సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. చార్లీ, మేము నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తామని పోస్ట్ చేసి వెల్లడించారు. వైట్ హౌస్ కూడా ఈ ఘటనపై స్పందించింది. చార్లీ కిర్క్ గౌరవార్థం అమెరికా అంతటా జాతీయ జెండాలను అవనతం చేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. ఇది చార్లీ పట్ల దేశం చూపిస్తున్న గౌరవాన్ని తెలియజేస్తుందని చెప్పవచ్చు.


కొనసాగుతున్న విచారణ

ఈ ఘటనపై FBI డైరెక్టర్ కాష్ పేటల్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి మొదట అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారించిన తర్వాత విడుదల చేసినట్లు ప్రకటించారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 11 , 2025 | 07:26 AM