Share News

White House: వైట్ హౌస్ నుంచి వేలాది మంది ఉద్యోగులు తొలగింపు..!

ABN , Publish Date - Oct 16 , 2025 | 09:22 AM

అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతోంది. అందులో భాగంగా వివిధ విభాగాల్లోని ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు.

White House: వైట్ హౌస్ నుంచి వేలాది మంది ఉద్యోగులు తొలగింపు..!
White House

వాషింగ్టన్, అక్టోబర్ 16: అమెరికాలో ప్రభుత్వం విధించిన షట్ డౌన్ మూడో వారం కొనసాగుతుంది. ఈ కారణంగా.. అమెరికా అధ్యక్ష భవనంలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 10 వేల మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ చీఫ్ రసెల్ వోట్ వెల్లడించారు. ఆయన ఒక షోకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని తొలగింపులు ఉంటాయని ప్రశ్నించినప్పుడు పైవిధంగా సమాధానం ఇచ్చారు. అయితే కోర్టులో న్యాయ శాఖ దాఖలు చేసిన పత్రాల ద్వారా నాలుగు వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించినట్లు స్పష్టమైందన్నారు. దీంతో దేశంలో ట్రెజరీ, ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణ విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయిన్నారు. దీని ప్రభావం మరింతగా ఉండే అవకాశం లేక పోలేదని స్పష్టం చేశారు.


నవంబర్ చివరిలోపు ప్రభుత్వానికి నిధులు సమకూర్చేందుకు హౌస్ ఆమోదించిన తీర్మానానికి మద్దతు ఇవ్వడం డెమోక్రాట్లు నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ప్రతిపక్ష పార్టీతో జతకట్టిన కార్మికులను లక్ష్యంగా చేసుకుని భారీగా తొలగింపులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించిన విషయం విదితమే.


ద్రవ్య బిల్లులు ఓకే చెప్పేలా డెమోక్రాట్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం వద్ద మరో మార్గం లేకుండా పోయిందని వైట్ హౌస్ బడ్జెట్ ఆఫీసు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నుంచి తొలగింపుల ప్రక్రియ మొదలైందని బడ్జెట్ ఆఫీస్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే ఏయే విభాగాల ఉద్యోగులను తొలగించారు.. ఎంతమందికి ఉద్వాసన పలికారనే వివరాలను మాత్రం వెల్లడించక పోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి:

జగన్ విదేశీ పర్యటన.. కోర్టును ఆశ్రయించిన సీబీఐ

దారుణం.. మద్యం తాగి స్కూల్‌కు వెళ్లిన విద్యార్థి.. చివరకు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2025 | 10:11 AM