Share News

New Baba Vanga: మూడు వారాల్లో మరో పెను విపత్తు.. ఆందోళన కలిగిస్తున్న కొత్త బాబా వంగ జోస్యం..

ABN , Publish Date - Jun 17 , 2025 | 06:09 PM

బాబా వంగా జోస్యం గురించి అందరికీ తెలుసు. ఆమె చెప్పిన అనేక మాటలు నిజమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా, న్యూ బాబా వంగా జోస్యం అందరినీ కలవరపెడుతోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబోవు 3 వారాల్లో ఓ పెద్ద విపత్తు సంభవిస్తుందనేది ఈ కొత్త బాబా జోస్యం. దీంతో..

New Baba Vanga: మూడు వారాల్లో మరో పెను విపత్తు.. ఆందోళన కలిగిస్తున్న కొత్త బాబా వంగ జోస్యం..
New Baba Vanga

బాబా వంగా జోస్యం గురించి అందరికీ తెలుసు. ఆమె చెప్పిన అనేక మాటలు నిజమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా, న్యూ బాబా వంగా జోస్యం అందరినీ కలవరపెడుతోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబోవు 3 వారాల్లో ఓ పెద్ద విపత్తు సంభవిస్తుందనేది ఈ కొత్త బాబా జోస్యం. దీంతో ఆ దేశానికి విమాన బుకింగ్‌లు 83 శాతం తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.


న్యూ బాబా వంగా అని పిలవబడే జపనీస్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి చెప్పిన జోస్యం.. ప్రస్తుతం పెను సంచలనం సృష్టిస్తోంది. వచ్చే జూలైలో జపాన్‌కు (Japan) భారీ సునామీ ముప్పు ఉందని ఆమె అంచనా వేశారు. 2025 జూలై 5వ తేదీన ఈ మహా విపత్తు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని రియో టాట్సుకి.. తన‘ ది ఫ్యూచర్ ఐ సా’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన లేదా అగ్నిపర్వత విస్ఫోరణం వల్ల ఈ విపత్తు సంభవించవచ్చని ప్రస్తావించారు. ఇది మెగా సునామీ, భూకంపం రూపంలో ఉండొచ్చన్నారు. సముద్రంలో గాలి బుడగలు బయటకు వచ్చే దృశ్యాలు తనకు కలలో కనిపించాయని చెప్పారు. ఇది సముద్ర గర్భంలో అగ్నిపర్వత పేలుడుకు సంకేతమని న్యూ బాబా వంగా తన పుస్తకంలో ప్రస్తావించారు.


రద్దవుతున్న బుకింగ్‌లు..

న్యూ బాబా వంగా జోస్యంతో టూరిజంపై బాగా ఎఫెక్ట్ పడింది. జపాన్‌కు విమాన బుకింగ్‌లు (Flight bookings) 83 శాతం తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. జూలైలో జపాన్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జపాన్ టూరిజం బుకింగ్స్‌లోనూ భారీ కోత కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బోయింగ్ విమానాల్లో చేసుకున్న బుకింగ్‌లు 15 నుంచి 20 శాతం మంది రద్దు చేసుకుంటున్నారు. చైనాలోని హాంగ్ కాంగ్ నుంచి వచ్చే విమానాలతో పాటూ హోటల్ బుకింగ్స్ 50 శాతం పడిపోయినట్లు బ్లూమ్ బర్గ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది. అదేవిధంగా చైనాతో పాటూ థాయిలాండ్, వియాత్నం బుకింగ్స్ కూడా 83 శాతం పడిపోయినట్లు చెబుతున్నారు. తాము 80 శాతం సీట్లు భర్తీ అవుతాయని భావించామని, అయితే రిజర్వేషన్లు 40 శాతం మాత్రమే వచ్చాయని ఎయిర్‌లైన్ జపాన్ కార్యాలయం జనరల్ మేనేజర్ హిరోకి ఇటో తెలిపారు.


పుకార్లను నమ్మొద్దు..

మియాగి ప్రిఫెక్చర్ గవర్నర్ యోషిహిరో మురై మాట్లాడుతూ ప్రజలు పుకార్లను నమ్మొద్దని సూచించారు. జపనీయులు ఎవరూ విదేశాలను పారిపోవడం లేదని, కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మకుండా తమ ప్రాంతాలను సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


గతంలో నిజమైన జోస్యం..

జపనీస్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి గతంలో చెప్పిన జోస్యం నిజమైంది. 2011లో జపాన్‌లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీ గురించి, ఫుకుషిమా దైచి అణు విపత్తు, యువరాణి డయానా మరణం, ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణంతో పాటూ కొవిడ్-19 మహమ్మారి తదితరాలపై ఆమె గతంలో కచ్చితమైన అంచనా వేశారు. ఈమె జోస్యానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. ప్రజలు ఆమె జోస్యాన్ని బాగా విశ్వసిస్తున్నారు. 2030 లో కొవిడ్ మహమ్మారి మళ్లీ ఎటాక్ చేస్తందని, ఈసారి దాని ప్రభావం మరింత ప్రాణాంతకంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్

కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ..ట్రంప్‌ నేతన్యాహూ మధ్య వీటో వివాదం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 06:26 PM