Share News

Taliban on Bagram Base: అంగుళం కూడా వదులుకోము.. ట్రంప్‌కు తేల్చి చెప్పిన తాలిబన్

ABN , Publish Date - Sep 21 , 2025 | 08:35 PM

బాగ్రామ్ వాయుసేన స్థావరాన్ని అమెరికాకు ఇచ్చేదే లేదని అప్ఘానిస్థాన్ స్పష్టం చేసింది. అప్ఘాన్ భూభాగంలో అంగుళం స్థలంపై కూడా డీల్ సాధ్యం కాదని స్పష్టం చేసింది.

Taliban on Bagram Base: అంగుళం కూడా వదులుకోము.. ట్రంప్‌కు తేల్చి చెప్పిన తాలిబన్
Taliban Rejects Bagram Demand

ఇంటర్నెట్ డెస్క్: బాగ్రామ్‌ వైమానిక స్థావరాన్ని తిరిగిచ్చేయాలంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తాలిబన్లు గట్టిగా బదులిచ్చారు. అప్ఘాన్ భూభాగంలో అంగుళం కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. రాజధాని కాబుల్‌కు ఉత్తరాన బాగ్రామ్ వాయుసేన స్థావరం ఉంది. యావత్ దేశంలో ఇదే అతిపెద్ద వాయుసేన స్థావరం. అమెరికా మిలిటరీ దాదాపు 20 ఏళ్ల పాటు ఇక్కడి నుంచే తన కార్యకలాపాలు నిర్వహించింది. అప్ఘానిస్థాన్ తాలిబన్‌ల వశమయ్యాక అమెరికా సేనలు బాగ్రామ్ విడిచిపెట్టి స్వదేశానికి పయనమయ్యాయి (Taliban rejects Bagram demand).

ట్రంప్ కామెంట్స్‌పై ఇటీవల అప్ఘానిస్థాన్ రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసీహుద్దీన్ ఫిత్రత్ స్పందించారు. ఏదోక రాజకీయ డీల్ ద్వారా ఈ స్థావరాన్ని కొందరు మళ్లీ దక్కించుకోవాలని చూస్తున్నట్టు తెలిపారు. చర్చలు కూడా జరుపుతున్నామని వాళ్లు చెప్పుకుంటున్నట్టు తెలిపారు. అయితే, అప్ఘాన్ భూభాగానికి చెందిన ఒక అంగుళం నేలపైనా ఎలాంటి డీల్ కుదరదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అప్థానిస్థాన్ ప్రభుత్వం కూడా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ స్వాతంత్ర్యానికి, ప్రాదేశిక సమగ్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని పేర్కొంది (Trump wants Bagram base back).


బాగ్రామ్ స్థావరాన్ని అమెరికా వదులుకున్నందుకు ట్రంప్ చాలా కాలంగా బైడెన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. చైనాకు సమీపంలో ఉన్న ఈ వాయుసేన స్థావరాన్ని కోల్పోవడం అమెరికాకు నష్టమని అన్నారు. ఇక గురువారం బ్రిటన్ పర్యటన సందర్భంగా ట్రంప్ బాగ్రామ్ ఎయిర్ బేస్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ బేస్‌ను నిర్మించిన అమెరికాకు మళ్లీ దాన్ని తిరిగి అప్పగించాలని అన్నారు. 2021లో అప్ఘానిస్థాన్ తాలిబాన్‌ల హస్తగతమైన నేపథ్యంలో అమెరికా సేనలు బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను వీడాయి. అమెరికా హయాంలో ఈ వైమానిక స్థావరం అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. 2010లో అప్ఘానిస్థాన్‌పై అమెరికా పట్టు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ఈ స్థావరంలో చిన్న టౌన్‌ వలె సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బర్గర్ కింగ్స్‌ కూడా ఇక్కడ ఓ స్టాల్‌ను తెరిచింది.


ఇవి కూడా చదవండి:

హెచ్-1బీ వీసా పెంపును సమర్థించుకున్న అమెరికా.. వాస్తవాలు ఇవిగో అంటూ ప్రకటన

హెచ్-1బీ వీసాదారులను అడ్డుకునేందుకు ఆన్‌లైన్ భారీ ఆపరేషన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 08:43 PM