Putin Reaction On Trump Decision: తొలిసారి ఆంక్షలు విధించిన అమెరికా.. స్పందించిన పుతిన్
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:18 AM
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రష్యాపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు.
మాస్కో, అక్టోబర్ 24: చమురు సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షలు తీవ్రమైనవని.. కానీ ఇవి తమ దేశ ఆర్థిక వ్యవస్థను అంతగా ప్రభావితం చేయవని రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. రెండు ప్రధాన చమురు సంస్థలపై ఆమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో మాస్కాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలేకర్లతో మాట్లాడుతూ..పై విధంగా స్పందించారు. అమెరికా, రష్యా మధ్య సంబంధాలు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఆంక్షలు వల్ల స్నేహ సంబంధాలు దెబ్బతింటాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రష్యాపై ఈ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఇక ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నిలువరించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో చర్చలు జరపాల్సి ఉంది. కానీ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి పుతిన్ ససేమిరా అన్నారు. ఆ క్రమంలో ఈ చర్చలు వాయిదా పడ్డాయి. అంతకు ముందు ఈ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకోక పోవడంతో.. ఈ దేశాధినేతల మధ్య చర్చలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై నేటికి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో పుతిన్ వైఖరిపై ట్రంప్ కాస్తా గుర్రుగా ఉన్నారు.
ఆ క్రమంలో రష్యాలోని రెండు అతి పెద్ద చమురు ఉత్పత్తిదారులు రోస్ నెఫ్ట్, లుకోయిల్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇక చర్చల వల్ల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల కొనసాగింపునకు తాము ఎల్లప్పుడు సిద్ధమని పేర్కొన్నారు. రష్యాపై తోమహాక్‌తో దాడులు జరిపితే.. చాలా బలంగా ప్రతిస్పందిస్తామని అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు.
మరోవైపు.. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచే క్రమంలో దాదాపు 2000 వేల తోమహాక్ క్షిపణులు అందజేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని పుతిన్‌కు తెలియజేశారు. అలా చేస్తే అమెరికా, రష్యా సంబంధాలు దెబ్బతింటాయని ట్రంప్‌కు ఆయన వివరించారు. ఒక వేళ ఈ తోమహాక్ క్షిపణులతో రష్యాపై దాడి చేస్తే తీవ్రంగా స్పందిస్తామని పుతిన్ తాజాగా స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బస్సు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ రియాక్షన్
పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్..
For More International News And Telugu News