Bus Fire in Kurnool: బస్సు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ రియాక్షన్
ABN , Publish Date - Oct 24 , 2025 | 08:36 AM
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధమై పలువురు ప్రయాణికులు మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 24: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధమై పలువురు ప్రయాణికులు మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం అన్ని రకాల సహయక చర్యలను చేపట్టిందని వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించామని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
వైఎస్ జగన్ రియాక్షన్..
కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు గ్రామ సమీపంలో బస్సు ప్రమాద ఘటన విషాదకరమని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ అగ్ని ప్రమాద ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సానుభూతి తెలిపారు. ఈ ఘటన గాయపడిన వారికి అన్ని రకాల సహాయం అందించాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా వైఎస్ జగన్ స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్..
బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
For More AP News And Telugu News