Share News

PM Modi: వెల్ కం టూ మై ఫ్రెండ్.. మోదీకి స్వాగతం పలికిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

ABN , Publish Date - Feb 11 , 2025 | 12:17 PM

భారత ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్ ఘన స్వాగతం పలికారు. పారిస్‌లో ఏఐ సమ్మిట్‌కు సహ అధ్యక్షత వహించే ముందు జరిగిన విందులో మోదీని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.

PM Modi: వెల్ కం టూ మై ఫ్రెండ్.. మోదీకి స్వాగతం పలికిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
PM Modis Visit to France

ప్రధాని నరేంద్ర మోదీ (modi)కి ఫ్రాన్స్‌(France)లో ఘన స్వాగతం లభించింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌(Emmanuel Macron).. వెల్ కం టూ మై ఫ్రెండ్ మోదీ అంటూ స్వాగతం పలికారు. ఈ క్రమంలో పారిస్‌లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్ మూడో ఎడిషన్‌కు మోదీ సహ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమ్మిట్‌లో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అణుశక్తి సహా ఇతర ఆధునిక సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ టెక్నాలజీ సీఈఓలు సహా పలువురు నాయకులకి కీలక వేదికగా మారింది.


ద్వైపాక్షిక సంబంధాలపై..

దీంతోపాటు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధాని మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడితో కలిసి చర్చించనున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న AI సాంకేతికతను సురక్షితంగా అభివృద్ధి చేయడంపై ఫోకస్ చేయనున్నారు. అలాగే ఈ సమ్మిట్ యూకే, దక్షిణ కొరియా వంటి దేశాల్లో గతంలో జరిగిన AI సమ్మిట్లలో కొనసాగుతున్న ఆవిష్కరణలపై మరింతగా చర్చిస్తారు. ఈ AI సమ్మిట్ కైవలం సాంకేతికతపై మాత్రమే ఫోకస్ చేయకుండా, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న AI రంగంలోని సవాళ్లు, అవకాశాల గురించి కూడా చర్చించేందుకు వేదికగా ఉంటుంది.


మోదీ ప్రసంగం..

ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా AI నైతిక, బాధ్యతాయుతమైన వినియోగంపై చర్చిస్తారు. ఈ సమ్మిట్‌లో భాగంగా ప్రధానమంత్రి మోదీ.. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో అందించే అవకాశాలపై ప్రపంచ నాయకులతో కలిసి చర్చించనున్నారు. ప్రధాని మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఇద్దరూ కూడా CEOల ఫోరంలో ప్రసంగిస్తారు. ఈ ఫోరం భారతదేశం, ఫ్రాన్స్ వ్యాపార రంగం మధ్య అనుసంధానాన్ని మరింత బలపరుస్తుంది. ప్రపంచ నాయకులు, టెక్నాలజీ CEOల సమావేశానికి సహ అధ్యక్షత వహించడం గౌరవంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.


ఇటర్ వ్యవస్థ..

ఇటర్ (ITER) సైట్ సందర్శన తర్వాత ప్రధాని మోదీ తన ఫ్రాన్స్ పర్యటన పూర్తవుతుంది. ITER (అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్) ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇది క్లీన్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని అభివృద్ధి చేసే లక్ష్యంతో రూపొందించబడింది. భారత్ ITER ప్రాజెక్టులో కీలక భాగస్వామిగా ఉంది. ITER ద్వారా ప్రపంచానికి సురక్షితమైన శక్తి వనరులను అందించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

Jets Crash: ఢీకొన్న రెండు విమానాలు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్


8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 11 , 2025 | 12:21 PM