Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 31మంది మృతి..
ABN , Publish Date - Oct 01 , 2025 | 09:30 AM
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు అయ్యింది. భూకంప తీవ్రతతో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో చాలా ఇళ్లు, భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్‌లో..
ఫిలిప్పీన్స్, అక్టోబర్ 1: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు అయ్యింది. భూకంప తీవ్రతతో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో చాలా ఇళ్లు, భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్‌లో దాదాపు 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అలాగే 147 మంది గాయపడినట్లు సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సెబు ప్రావిన్స్‌లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు ప్రకటించారు. బోగో ప్రాంతంలోనే భూకంప తీవ్రత అధికంగా ఉందని.. ఇక్కడ 19 మంది చనిపోగా.. 119 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇక ఆయా ప్రాంతాల్లో రోడ్లు బీటలు వారాయి. పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటంతో.. ఇళ్లన్నీ నేలమట్టం అయ్యాయి. శిథిలాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
Also Read:
పనిమనిషి ఫిర్యాదు.. హీరోయిన్ డింపుల్ హయతీపై..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎండ్!
For More International News and Telugu News..