Share News

Israel War: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ఎండ్! ట్రంప్‌కు భారత్, చైనా, రష్యా మద్దతు

ABN , Publish Date - Oct 01 , 2025 | 08:38 AM

భీకరంగా సాగిన ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం చరమాంకానికి చేరుకుంటోంది. ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాకు భారత్, చైనా, రష్యా సహా దాదాపు అన్ని దేశాలు మద్దతునిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇప్పటికే ఆమోదం తెలుపగా..

Israel War: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ఎండ్! ట్రంప్‌కు భారత్, చైనా, రష్యా మద్దతు
Israel-Hamas war reaches its climax

ఇంటర్నెట్ డెస్క్: భీకరంగా సాగిన ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం చరమాంకానికి చేరుకుంటోంది. యుద్ధం నిలువరించేందుకు ప్రపంచ దేశాలు కీలక అడుగులు వేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాకు భారత్, చైనా, రష్యా సహా దాదాపు అన్ని దేశాలు మద్దతునిస్తున్నాయి.

కాగా, ట్రంప్ ప్రతిపాదనకు ఇజ్రాయెల్‌ ఇప్పటికే అంగీకరించగా.. హమాస్ మాత్రం దీనిపై అధ్యయనం చేశాక చెబుతామని అంటోంది. ‘ఆయుధాలను వదిలేయడం’ అనే షరతు హమాస్ కు నచ్చడం లేదు. దీనిపై ఏకాభిప్రాయం వస్తే యుద్ధం ముగిసినట్లే. అటు, పాలస్తీనాకు దేశం హోదా అనే హామీ మీద కూడా హమాస్‌లో అనుమానాలు నెలకొన్నాయి.


ఆయుధాలను వదిలేయాలన్న షరతుకు హమాస్‌ నిరాకరిస్తే ఇజ్రాయెల్‌కు అమెరికా స్వేచ్ఛనిస్తుంది. తద్వారా ఇప్పటికే ధ్వంసమైన గాజా పూర్తిగా కకావికలం అవుతుంది. ఒక వేళ ఇరువర్గాలు షరతుల్ని అంగీకరిస్తే, 72 గంటల్లో బందీలందరినీ హమాస్‌ విడుదల చేయాలి. ప్రతిగా 250 మంది ఖైదీలను ఇజ్రాయెల్‌ విడిచిపెట్టాలి. 1,700 మంది సాధారణ పౌరులనూ వదిలిపెట్టాల్సి ఉంటుంది.


అంతేకాదు, ఈ ఒప్పందం కుదిరితే, ఇక గాజా పాలనలో హమాస్‌ ప్రమేయం ఏమాత్రం ఉండదు. దాని ఆయుధ వ్యవస్థలను, సొరంగాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. గాజాలో అంతర్జాతీయ పాలన ప్రారంభమవుతుంది. ట్రంప్‌ ప్రణాళికపై ఇప్పటికే హమాస్‌ నేతలతో ఖతార్, ఈజిప్టు నేతలు చర్చించారు.

గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్‌ ప్రతిపాదించిన ప్రణాళికను భారత ప్రధాని మోదీ స్వాగతించారు. అందరూ కలిసి వచ్చి ట్రంప్‌ ప్రణాళికకు ఆమోదం తెలిపి కార్యాచరణ ప్రారంభిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త

ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం

Updated Date - Oct 01 , 2025 | 08:44 AM