Share News

Hyderabad: ముందు సిమెంట్‌.. వెనుక గంజాయి

ABN , Publish Date - Oct 01 , 2025 | 07:55 AM

పైకి చూస్తే అన్నీ సిమెంట్‌ బస్తాలే కనిపిస్తాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే వాటి వెనుక గంజాయి ప్యాకెట్లు దర్శనమిస్తాయి. సిమెంట్‌ లోడులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని మహేశ్వరం జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: ముందు సిమెంట్‌.. వెనుక గంజాయి

- లారీలో రవాణా.. నిందితుడి అరెస్ట్‌

- రూ.6 కోట్ల విలువైన సరుకు స్వాధీనం

హైదరాబాద్: పైకి చూస్తే అన్నీ సిమెంట్‌ బస్తాలే కనిపిస్తాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే వాటి వెనుక గంజాయి ప్యాకెట్లు దర్శనమిస్తాయి. సిమెంట్‌ లోడులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని మహేశ్వరం జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.6 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. రాచకొండ(Rachakonda) పరిధిలో ఈ స్థాయిలో గంజాయిని పట్టుకోవడం మొట్టమొదటి సారి అని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.


కమిషనరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మంగళవారం వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌కు చెందిన విక్రమ్‌ విష్ణోయ్‌ అలియాస్‌ వికాస్‌(22) గంజాయి సరఫరాదారుడు. రాజస్థాన్‌ నుంచి భవన నిర్మాణ రంగంలో ఉపయోగించే ఐరన్‌ రాడ్స్‌ లోడ్‌తో భద్రాచలం చేరుకుని అన్‌లోడ్‌ చేసి సిమెంట్‌ బస్తాలు లోడ్‌ చేశాడు. ఒడిశా మల్కాన్‌గిరి(Odisha, Malkangiri)లో 1,210 కిలోల గంజాయి (పాకెట్లలో)ని కూడా లారీలో లోడ్‌ చేసుకున్నాడు.


city3.jpg

బయటి నుంచి సిమెంటు బ్యాగులు కనిపించేలా ఏర్పాటు చేసి వెనుక గంజాయి ప్యాకెట్లను ఉంచాడు. తనిఖీల్లో కవర్‌ పైకి లేపి చూస్తే సిమెంటు బ్యాగులు కనిపించేలా ప్లాన్‌ చేశాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్‌ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు కొత్తగూడ క్రాస్‌రోడ్స్‌లో లారీని అడ్డగించారు. తనిఖీల్లో గంజాయి ప్యాకెట్లు గుర్తించారు. వికా్‌సను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కథ వెలుగు చూసింది. రాజస్థాన్‌కు చెందిన గంజాయి స్మగ్లర్లు దేవీలాల్‌(మధ్యవర్తి),


అయూబ్‌ఖాన్‌, రామ్‌లాల్‌ గంజాయి రవాణా చేసినందుకు లోడ్‌కు రూ. 5 లక్షలు అందజేసేవారని విచారణలో చెప్పాడు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 6 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఓటీ మహేశ్వరం ఏడీసీపీ ఎండీ శాకీర్‌హుస్సేన్‌, ఎల్‌బీనగర్‌ - మహేశ్వరం ఏసీపీ పి. సత్తయ్య, ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !

Read Latest Telangana News and National News

Updated Date - Oct 01 , 2025 | 07:55 AM