Dimple Hayathi: పనిమనిషి ఫిర్యాదు.. హీరోయిన్ డింపుల్ హయతీపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు
ABN , Publish Date - Oct 01 , 2025 | 09:08 AM
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 'నా చెప్పుల విలువ కాదు.. నీ బ్రతుకు' అంటూ.. దూషణలు.. అకారణంగా దాడి..
హైదరాబాద్, అక్టోబర్ 1: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ హయతి దూషణలు చేసినట్టు సమాచారం.
'నా చెప్పుల విలువ కాదు.. నీ బ్రతుకు' అంటూ.. దూషణలు.. అకారణంగా దాడి చేసినట్టు ఇంట్లో పనిచేసే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పని పనిమనిషి ఫిర్యాదుతో హీరోయిన్ డింపుల్ హయతీ తో పాటు ఆమె భర్త మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం