India vs Pakisthan: పాకిస్థాన్‌కు పెద్ద కష్టమే వచ్చిందిగా.. వైరల్ అవుతున్న వీడియోలు..
ABN , Publish Date - May 03 , 2025 | 05:33 PM
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటి వరకు కొనసాగిన సంబంధాలన్నీ క్షీణించాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్గతంగా ఉగ్రవాద నిర్మూలనా కార్యక్రమాలు చేపడుతున్న భారత్.. మరోవైపు, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పైనా..
న్యూఢిల్లీ, మే 03: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటి వరకు కొనసాగిన సంబంధాలన్నీ క్షీణించాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్గతంగా ఉగ్రవాద నిర్మూలనా కార్యక్రమాలు చేపడుతున్న భారత్.. మరోవైపు, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పైనా కఠిన ఆంక్షలు విధిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. సరిహద్దుల్లో ఇరు దేశాల సైనిక బలగాలు భారీగా మోహరించాయి. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ నుంచి ఒక ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో(PoK)లో స్థానికులకు పాకిస్థాన్ ఆర్మీ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చనే భయంతో ఉన్న పాక్.. ఆ దిశగా సంసిద్ధమవుతోంది. ఇప్పటికే సరిహద్దుల వెంబడి భారీగా సైనికులు మోహరించగా.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సైన్యం శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది. ఆ శిబిరాలలో స్థానికులకు ఆయుద్ధాలను వినియోగించడంలో శిక్షణ ఇస్తున్నారు. పాకిస్థాన్ భద్రతా బలగాలు భారత్‌త యుద్ధంలో పాల్గొనడానికి ఇష్టపడటం లేదని, ఇప్పటికే అనేక మంది సైనికులు పాక్ ఆర్మీ నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో సెన్సేషన్‌గా మారింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి తరువాత భారత్.. పాకిస్థాన్‌పై అనేక దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను, ఆ కుట్రలో భాగమైన వారిని వారి ఊహకు అందని విధంగా శిక్షిస్తానని ప్రకటించారు. పర్యాటకులపై దాడి చేసి తప్పు చేశారని.. దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇటీవల రక్షణ శాఖ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద దాడికి భారతదేశం స్పందించే విధానం, లక్ష్యాలు, సమయాన్ని నిర్ణయించే విషయంలో సాయుధ దళాలకు పూర్తి స్వే్చ్ఛ ఇస్తున్నామని ప్రధాని చెప్పారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌ను ఒక మోసపూరిత దేశంగా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాక్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. పహల్గాం దాడి బాద్యులను వదిలే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
పాక్ పాకులాట..
పహల్గాం దాడి తరువాత భారత్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఓవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే.. మరోవైపు భారత్‌ను శాంతింపజేయాలంటూ సోదర దేశాలను ప్రాదేయపడుతోంది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా సౌదీ అరేబియాతో సహా సోదర దేశాలతో మంతనాలు జరిపారట. భారత్, పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలను తగ్గించడంలో సహకరించాలని కోరాట. ఉద్రిక్తతలను తగ్గించేలా భారత్‌ను శాంతింపజేయాలని సదరు దేశాలను పాక్ ప్రధాని కోరారట. ఇదే విషయంపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read:
పాకిస్తాన్ ఉగ్రవాద ట్రాక్ రికార్డ్
కోహ్లీ vs ధోనీ.. ఇదే చివరి మ్యాచ్ అవుతుందా
పామును చూడగానే నాగిని పాట ప్లే చేశారు.. చివరికి
For More International News and Telugu News..