Share News

Shahbaz Sharif: భారత్‌పై మరోమారు పాక్ ప్రధాని విషపూరిత వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jul 06 , 2025 | 09:28 AM

Shehbaz Sharif On Pahalgam attack: అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మరోసారి ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కింది. అజర్‌బైజాన్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడిపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మొసలి కన్నీరు కార్చడమే కాకుండా భారతదేశంపై విషం కూడా కక్కారు. భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

Shahbaz Sharif: భారత్‌పై మరోమారు పాక్ ప్రధాని విషపూరిత వ్యాఖ్యలు..
Pakistan PM Shehbaz Sharif Pahalgam attack statement

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మరోసారి భారతదేశంపై విషం కక్కారు. భారతదేశం రెచ్చగొట్టకుండానే శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోందని, ప్రాంతీయ శాంతికి భంగం కలిగించడానికి పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. లష్కర్‌తో సంబంధం ఉన్న ఒక సంస్థ పహల్గామ్ దాడికి బాధ్యత వహించినప్పటికీ భారతదేశం సౌమ్యంగా ఉన్నట్టు నటిస్తూనే శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. అలాగే గాజా, ఇరాన్‌లలో 'అమాయక ప్రజలను' లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆయన ఖండించారు. అజర్‌బైజాన్‌లో జరిగిన ఆర్థిక సహకార సంస్థ (ECO) శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రసంగంలో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో అజర్‌బైజాన్ పాకిస్ణాన్‌కు మద్దతు ఇచ్చింది.


అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మరోసారి ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి దురదృష్టకరమని షాబాజ్ అభివర్ణించారు. కానీ అదే సమయంలో భారతదేశం ప్రాంతీయ శాంతిని అస్థిరపరుస్తోందని ఆరోపించారు. కానీ, పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎలా పెంచి పోషిస్తోందో.. ఆ దేశ సైన్యం ఉగ్రమూకలను రక్షించేందుకు శక్తివంచన లేకుండా ఎలా కృషి చేస్తున్నాయో ప్రపంచానికంతా తెలిసిందే. నలుగురిలో నవ్వులపాలవుతామని తెలిసినా సిగ్గు విడిచి అంతర్జాతీయవేదికలపై భారతదేశంపై నీచమైన ఆరోపణలు చేస్తూనే ఉంది దాయాది దేశం. ఒక పక్క ఉగ్రవాదాన్ని భారతదేశంపైకి ఎగదోస్తూనే శాంతి మంత్రం పఠిస్తున్న పాక్ ప్రధాని షాబాజ్ ధైర్యం అందరికీ ఆశ్యర్చం కలిగిస్తోంది.


ఇజ్రాయెల్ దాడులను ఖండించిన షరీఫ్

ఇరాన్‌పై ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులను కూడా పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. దీనిని దురాక్రమణ చర్యగా అభివర్ణించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ జూన్‌లో ఆపరేషన్ రైజింగ్ లయన్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇరాన్ అణు కార్యక్రమం తమ ఉనికికి ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ భావించడమే కారణం. 12 రోజుల వివాదం తర్వాత ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ పోరులో 600 మందికి పైగా ఇరానియన్లు మరణించారు.


ఇవి కూడా చదవండి

గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు

అమెరికా పార్టీని ప్రారంభించిన ఎలన్ మస్క్

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 10:28 AM