Share News

Train Hijack: పెషావర్‌ రైలు హైజాక్ ఘటన అప్‎డేట్.. ఇప్పటివరకు

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:11 PM

పెషావర్‌ రైలు హైజాక్ ఘటనలో ఇప్పటివరకు 127 మంది ప్రయాణికులను రక్షించినట్లు పాకిస్తాన్ భద్రతా దళాలు తెలిపాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించారు.

Train Hijack: పెషావర్‌ రైలు హైజాక్ ఘటన అప్‎డేట్.. ఇప్పటివరకు
peshawar train hijack Incident

పాకిస్తాన్‌(Pakistan) బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా నుంచి వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌కు మంగళవారం వెళ్లాల్సిన రైలులో హైజాక్ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది. ఈ ఘటనలో ఇప్పటివరకు వేర్పాటు వాదుల బృందం 127 మంది ప్రయాణికులను రక్షించినట్లు పాకిస్తాన్ భద్రతా దళాలు వెల్లడించాయి. ఈ దాడికి బాధ్యత వహించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటోంది.


ప్రయాణిస్తున్న సమయంలో

క్వెట్టా నుంచి దాదాపు 160 కి.మీ (100 మైళ్ళ) దూరంలో ఉన్న సిబి నగరానికి సమీపంలో వరుస సొరంగాల మధ్య జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ క్రమంలో అప్రమత్తమైన పాకిస్తాన్ భద్రతా దళాలు ఇప్పటివరకు 27 మంది వేర్పాటువాదులను హతమార్చినట్లు ప్రకటించారు. ఈ ఘటనలో రైలు డ్రైవర్‌తో సహా దాదాపు 10 మంది ప్రయాణికులు మరణించినట్లు సమాచారం. అయితే ఈ మరణాల సంఖ్యను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.


పలువురిని..

మొదట ఈ రైలు ప్రయాణించిన సమయంలో 400 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, అందులో 250 మందికి పైగా ఇంకా రైలులోనే ఉన్నారని భావిస్తున్నారు. BLA యోధులు వారిని బందీలుగా ఉంచారని తెలిపారు. అయితే భద్రతా దళాలు దాడి చేసిన క్రమంలో వారు అనేక మంది ప్రయాణికులను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా అధికారులు మిగతా వారి కోసం తమ సైనిక ఆపరేషన్ చర్యలను కొనసాగిస్తున్నాయి.


గమ్య స్థానానికి చేరుకునేందుకు..

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జాఫర్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు క్వెట్టా నుంచి బయలుదేరింది. ఈ రైలు పంజాబ్ ద్వారా 1,600 కి.మీ (994 మైళ్ళు) కంటే ఎక్కువ ప్రయాణం చేసి, పెషావర్‌లోని తుది గమ్య స్థానానికి చేరుకునేందుకు దాదాపు 30 గంటలు పడుతుంది. రైలు పర్వతాలతో కూడిన బోలాన్ పాస్ గుండా వెళుతుండగా మధ్యాహ్నం 1 గంట తర్వాత దాడి జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం అనేక సొరంగాలకు నిలయంగా ఉంటుంది. ఇవి మొదట బ్రిటిష్ వలస పాలన సమయంలో నిర్మించబడ్డాయి.


తమ ప్రాంతం కోసం..

బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలు, ముఖ్యంగా BLA, స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాయి. వారు తమ ప్రాంతానికి సంబంధించిన వనరులపై స్థానిక ప్రజలకు అధిక హక్కులు ఉండాలని, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ స్వతంత్రత కోసం పోరాడుతున్నారు. ఈ వేర్పాటువాద సంస్థలు, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు చేస్తూ, తమ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

Iphone 17 Air: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 12 , 2025 | 01:57 PM