Iphone 17 Air: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్..
ABN , Publish Date - Mar 12 , 2025 | 07:49 AM
ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. మరికొన్ని నెలల్లో కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్ మోడల్‌ను లాంచ్ చేయనున్నట్లు లీక్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ఆపిల్ ప్రతి ఏడాది కూడా కొత్త ఆవిష్కరణలతో టెక్ ప్రియులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా, ఆపిల్ తన అత్యంత సన్నని ఐఫోన్ 17 ఎయిర్ విడుదల చేయాలని రెడీ అయినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 సిరీస్ తర్వాత కొత్త మోడల్ కోసం టెక్ ప్రియులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆపిల్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
డిజైన్
ఐఫోన్ 17 ఎయిర్ డిజైన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్లలో ఒకటిగా ఉంటుందని చెబుతున్నారు. దీని మందం కేవలం 6.25 మిమీ మాత్రమే. అంటే ప్రస్తుతం ఉన్న ఐఫోన్ 16 ప్రో కంటే 2 మిమీ సన్నగా ఉంటుంది. ఐఫోన్ 6 పూర్వపు మోడల్ కంటే కూడా ఇది చాలా సన్నగా ఉంటుంది. ఈ సన్నటి డిజైన్‌లో చక్కటి గ్రేడ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఉపయోగించడం వల్ల, లాంగ్ లైఫ్ బ్యాటరీ ఇస్తుందని చెబుతున్నారు.
ఫీచర్లు
ఈ డివైస్‌లోని ఫీచర్లు కూడా సరికొత్తగా ఉంటాయని అంటున్నారు. దీని 6.6 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే పిక్చర్ క్వాలిటీని ఇంకా మెరుగుపరుస్తాయి. ఇది వినియోగదారులకు అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఐఫోన్ 17 ఎయిర్‌లో ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ ఉండదు. ఆపిల్ ఈసారి పూర్తిగా ఎసీఎస్ (eSIM) పద్ధతిని అవలంబించడానికి ప్రాధాన్యతనిస్తుందని సమాచారం. ఇక ఈ డివైస్ 8GB RAMతో పాటు 512GB స్టోరేజ్ ఎంపికల్లో అందుబాటులో ఉండనుంది.
కెమెరా
కెమెరా విభాగంలో ఐఫోన్ 17 ఎయిర్ మిగతా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కంటే సులభంగా ఉపయోగించే ఒకే కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఈ కెమెరా 48MP ప్రధాన లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది హై-రెజల్యూషన్ ఫోటోలు , డియోలు తీసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సెల్ఫీ ప్రేమికుల కోసం 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుందని సమాచారం.
లాంచ్ డేట్
గత సంవత్సరం ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 ఎయిర్ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది 2025లో సెప్టెంబర్ 9 నుంచి 11 మధ్య ఉండవచ్చని లీక్స్ వెలుగులోకి వచ్చాయి. ఇక వీటి సేల్స్ సెప్టెంబర్ 18 లేదా 19 నుంచి మొదలయ్యే ఛాన్సుంది.
ధర
భారతదేశంలో ఐఫోన్ 17 ఎయిర్ ధర సుమారు రూ. 90,000 ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఐఫోన్ 16 ప్రో కంటే చాలా సన్నగా ఉండడంతో, అనేక మంది కొత్తగా వస్తున్న ఈ ఐఫోన్‌పై ఆసక్తి చూపించనున్నారు.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Read More Business News and Latest Telugu News