Pak PM Shehbaz Sharif: మోదీ పేరు కూడా పలకని భయస్తుడు ప్రధాని షెహబాజ్..ఎంపీ షాహిద్ విమర్శ
ABN , Publish Date - May 09 , 2025 | 06:19 PM
భారత్‌తో రాజకీయ, సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ అంతర్జాతీయంగా తన విశ్వసనీయతను కోల్పోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో సొంత ఎంపీల నుంచి కూడా అక్కడి ప్రధాని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే గత 48 గంటలుగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య నిరంతర ఘర్షణ కొనసాగుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన భారత్, ఇప్పుడు పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్‌లోని అనేక నగరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై కూడా దాడి చేసింది.
నష్టపోయిన పాకిస్తాన్
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని నాలుగు ప్రధాన నగరాల్లోని వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా భారతదేశం ధ్వంసం చేసింది. ఈ దాడుల వల్ల పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుత యుద్ధం లాంటి సంఘర్షణ కారణంగా పాకిస్తాన్ చాలా నష్టపోయింది. ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌ను (Pak PM Shehbaz Sharif) ఆయన సొంత ఎంపీ వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఎంపీ షాహిద్ అహ్మద్ ఖట్టక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై విమర్శలు గుప్పించారు.
సొంత ఎంపీ
పాకిస్తాన్ పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా శుక్రవారం ఎంపీ షాహిద్ అహ్మద్ (MNA) ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను పిరికివాడని అభివర్ణించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి భయపడే వ్యక్తి అని, ఆయన నరేంద్ర మోదీ పేరును కూడా ధైర్యంగా చెప్పలేరని ఇక్బాల్ అన్నారు. ఈ వ్యాఖ్యలు పాక్ సైన్యం భారత్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసిన ఒక రోజు తర్వాత వచ్చాయి. ఇక్బాల్ ఇంకా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అల్లా పాకిస్తానీయులను రక్షించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. భారత్‌తో పెరుగుతున్న శత్రుత్వం నేపథ్యంలో దేశ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కామెంట్లు
ఈ వీడియో చూసిన పాకిస్తాన్ పౌరులు షెహబాజ్ షరీఫ్ నాయకత్వాన్ని విమర్శిస్తూ వివిధ రకాలుగా పోస్ట్‌లు చేస్తున్నారు. ఒక X యూజర్ ప్రధానమంత్రి షెహబాజ్ ఆత్మవిశ్వాసం లేనివాడని పేర్కొన్నారు. మరొకరు షరీఫ్ నాయకత్వం దేశానికి అవసరమైన బలాన్ని ప్రదర్శించడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. షరీఫ్ గతంలో కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటీవల భారతదేశం.. పాకిస్తాన్ లోని అనేక లక్ష్యాలపై ఎటాక్ చేసిన తర్వాత షరీఫ్ మీడియా సమావేశంలో కూడా తడబడ్డాడు. దీంతో నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేశారు. ఈ సంఘటనలు షరీఫ్ నాయకత్వంపై అసంతృప్తిని మరింత పెంచుతున్నాయి.
ఇవి కూడా చదవండి
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
Operation Sindoor: దూకుడు పెంచిన పాక్.. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి