Share News

Operation Sindoor:మరోసారి బయటపడ్డ పాక్ అసలు రంగు.. ఉగ్రవాది అంత్యక్రియలకు ఆర్మీ అధికారులు హాజరు..

ABN , Publish Date - May 07 , 2025 | 05:53 PM

Operation Sindoor Pakistan: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాకిస్థాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పాక్ ఆర్మీ అధికారులు, సైన్యం ఉగ్రవాది అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.

Operation Sindoor:మరోసారి బయటపడ్డ పాక్ అసలు రంగు.. ఉగ్రవాది అంత్యక్రియలకు ఆర్మీ అధికారులు హాజరు..
Pak Army At Terrorist Funeral

Pak Army Terrorist Funeral: పాకిస్థాన్ దేశానికి, ఉగ్రవాదికి విడదీయలేని అనుబంధం ఉందన్నది బహిరంగ రహస్యం. ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ భారతదేశంపైకి ఉసిగొల్పుతూ కూడా మాకేం సంబంధం లేదని ప్రపంచం ముందు బుకాయించడం దాయాది దేశానికి వెన్నతో పెట్టిన విద్య. పహల్గాంలో పాశవిక ఉగ్రదాడి తర్వాత ముష్కరులను వెనకేసుకొస్తూనే.. మేమూ ఉగ్రవాద బాధితులమే అంటూ చిలక పలుకులు పలుకుతోంది. అయితే, తాజాగా పాక్ ఆర్మీ కనుసన్నల్లోనే ఉగ్రవాదులు ఘాతుకాలకు తెగబడుతున్నారనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. భారత త్రివిధ దళాల నేతృత్వంలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' లో చనిపోయిన ఉగ్రవాదుల కోసం పాకిస్థాన్ కన్నీరు కారుస్తోంది. వారి అంత్యక్రియలకు హాజరై భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు బయటికొచ్చాయి.


లష్కరే ఉగ్రవాదికి తల వంచి కన్నీటి వీడ్కోలు..

ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ నిరంతరం అబద్ధాలు చెబుతూనే ఉంటుంది. మేమూ ఉగ్రవాదం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని మొసలి కన్నీరు కారుస్తూనే ఉండే పాక్ దుర్భుద్ధిని 'ఆపరేషన్ సిందూర్' మరోమారు బయటపెట్టింది. పాక్ సైన్యానికి, ఉగ్రవాదులకు ఉన్న అనుబంధాన్ని ప్రపంచానికి తేటతెల్లం చేసింది. భారత వైమానిక దాడిలో మరణించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియలకు పాకిస్థాన్ ఆర్మీ అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉగ్రవాదులపై చర్య పేరుతో దాయాది దేశం ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తుందో ఈ ఉదంతమే సాక్ష్యం.

pak.jpg


భారత్‌కు వ్యతిరేకంగా పాక్ సైన్యం నినాదాలు..

భారత దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల కోసం పాకిస్థాన్ సైన్యం రోదిస్తోంది. లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియల ఊరేగింపు పాకిస్థాన్ సైన్యం, పోలీసులు, ఐఎస్ఐ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉగ్రవాదికి కన్నీటి వీడ్కోలు పలికారు. భారత దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల కోసం పాకిస్థాన్ సైన్యం రోదిస్తోంది. లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియల ఊరేగింపులో పాకిస్థాన్ సైన్యం, పోలీసులు, ఐఎస్ఐ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉగ్రవాదికి కన్నీటి వీడ్కోలు పలికారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు శవపేటికల ముందు తలలు వంచి నిలబడి ఉన్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


మంగళవారం రాత్రి 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా పాకిస్థాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత వైమానిక దళ యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్, మురిడ్కేలపై కూడా క్షిపణులను ప్రయోగించాయి. భారత భూభాగం నుంచి ఈ దాడులు నిర్వహించాయి.


లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం పాకిస్థాన్ పంజాబ్‌లోని మురిడ్కేలో ఉంది. ఇది లాహోర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సంస్థే 2008 ముంబై దాడులను నిర్వహించింది. ఐక్యరాజ్యసమితితో సహా అనేక దేశాలు దీనిని ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ నిషేధించాయి. ఈ సంస్థ భారతదేశంపై జరిగిన అనేక ఉగ్రవాద దాడుల వెనుక ప్రధాన సూత్రధారిగా ఉంది. కానీ ఈసారి భారత సైన్యం లష్కరే ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేసింది. భారత దాడిలో తన కుటుంబంలోని 10 మంది మరణించినట్లు జైషే మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్ ఒక ప్రకటన విడుదల చేశాడు. భారత దాడిలో మసూద్ అజార్ సోదరి, బావమరిది కూడా మరణించారు.

Updated Date - May 07 , 2025 | 08:15 PM