James Webb Telescope: కీలక విషయాన్ని కనుగొన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్
ABN , Publish Date - Aug 24 , 2025 | 08:10 AM
కొలరాడోలోని సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం తాజాగా జేమ్స్ వెబ్ స్పెస్ టెలిస్కోప్ ద్వారా కీలక విషయాన్ని కనుగొంది.
వాషింగ్టన్, ఆగస్టు 24: కొలరాడోలోని సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం తాజాగా జేమ్స్ వెబ్ స్పెస్ టెలిస్కోప్ ద్వారా కీలక విషయాన్ని కనుగొంది. అతి శీతల గ్రహం చుట్టు చిన్న చంద్రుడు పరిభ్రమిస్తున్నట్లు గుర్తించింది. యురేనస్ శీతల గ్రహమన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ గ్రహం సూర్యునికి ఏడో గ్రహంగా ఉంది. ఈ చంద్రుడిని ఎస్/ 2025 యు1గా పరిగణిస్తున్నారు. ఇది 6 మైళ్ల లేదా వ్యాసార్థంతో ఉంది. 1986లో నాసా వాయేజర్ 2 ప్రోబ్‌కు ఇది కనిపించ లేదు. ఇతర టెలిస్కోపులు సైతం ఈ చిన్న చంద్రుడిని గుర్తించ లేదు. ఇక దీని ఆవిష్కరణతో యురేనస్ చంద్రుల సంఖ్య 29కి చేరింది.
చిన్న చంద్రుడిపై ఈ శాస్త్రవేత్తల బృందానికి సారథ్యం వహిస్తున్న మరియమే ఎల్ మౌతమిద్ మాట్లాడుతూ.. నియర్ ఇన్‌ఫ్రారెడ కెమెరా ఈ చంద్రుడికి సంబంధించిన చిత్రాలను తీసిందన్నారు. ఈ చంద్రుడు కేవలం 6 మైళ్లు అంటే.. 10 కిలోమీటర్లు వేడల్పు మాత్రమే ఉందని వివరించారు. ఇది చాలా చిన్నదని.. భూమి, చంద్రుడి పరిమాణంలో ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశారు. దీని అతి చిన్న పరిమాణం కారణంగా.. గతంలో అంతరిక్ష నౌకలు కానీ, టెలిస్కోప్‌లు కానీ దీనిని గుర్తించ లేకపోయాయని తెలిపారు. అతి పెద్ద చంద్రులు మిరాండా, ఏరియల్, ఉంబ్రియేల్, టైటానియా, ఒబెరాన్ లోపలి కక్ష్యలో ఉన్న చిన్న చంద్రుల్లో ఇది 14వది అని సోదాహరణగా వివరించారు. ఇది యురేనస్ కేంద్రం నుంచి దాదాపు వృత్తాకార మార్గంలో దాదాపు 35,000 మైళ్ల కక్ష్యలో తిరుగుతుందన్నారు.
దీని ప్రాముఖ్యత ఏమిటంటే..
ఈ చిన్న చంద్రుడితో కలిపి.. యురేనస్ 29 చంద్రులను కలిగి ఉంది. అత్యధిక చంద్రులను కలిగిన గ్రహంలో ఇది ఒకటి. దీనికి అత్యంత సమీపంలో లెక్కకు మిక్కిలి ఉపగ్రహాలున్నాయి. అయితే దీని వద్ద ఉన్న మరిన్ని చంద్రులను కనుగోనాల్సి ఉంది. అలాగే యురేనస్ గురించి మరింత అధ్యయనం చేయాల్సి ఉంది. ఇక 1986లో వోయిజర్ 2 ద్వారా కేవలం ఐదు చంద్రులను మాత్రమే కనుగోన్ననారు. ఈ చిన్న చంద్రుడిని గుర్తించడం ద్వారా యురేనస్ వ్యవస్థ ఎలా ఏర్పడింది.. ఎలా పరిణామం చెందిందనే విషయాలపై అధ్యయనం చేయడం మరింత సులువుగా మారునందనే చర్చ పరిశోధకుల్లో ఒక చర్చ ప్రారంభమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మరో కీలక నిర్ణయం.. అమెరికాకు సేవలు నిలిపివేత
కీలక విషయాన్ని కనుగొన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్
For More International News And Telugu News