Viral News: పొంగిపోయిన పాక్ వైమానిక దళం.. ప్రచార యుద్ధమే, నిజం కాదన్న భారత్
ABN , Publish Date - May 16 , 2025 | 09:47 PM
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించినప్పటి నుంచి పాకిస్థాన్ అసత్య ప్రచారాన్ని పెంచిందనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే మరో ఫేక్ ప్రకటన వెలుగులోకి వచ్చింది.
పాకిస్థాన్ ఫేక్ సోషల్ మీడియా పోస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘ది డైలీ టెలిగ్రాఫ్’ పేరుతో సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కోడుతోంది. అందులో పాకిస్థాన్ వైమానిక దళం (పీఏఎఫ్)ను ‘ఆకాశంలో అప్రతిహత రాజు’గా ప్రకటించినట్లు చూపించింది. అయితే ఈ చిత్రం నకిలీదని, అది కృత్రిమ మేధస్సు (ఏఐ)తో క్రియేట్ చేసిందని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ‘ది డైలీ టెలిగ్రాఫ్’ ఇలాంటి కథనాన్ని ప్రచురించలేదని వెల్లడించింది.
ఆస్ట్రియా నిపుణుడు భారత్‌కు మద్దతు
వాస్తవానికి, ఆస్ట్రియాకు చెందిన యుద్ధ వైమానిక విశ్లేషకుడు టామ్ కూపర్ ఓ మీడియాతో మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ దూకుడుకు భారత్ ఇచ్చిన సమాధానం ‘స్పష్టమైన విజయం’ అని పేర్కొన్నారు. పాకిస్థాన్ శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభించడానికి భారత్ ఉన్నతమైన యుద్ధ శక్తి, బహుళ స్థాయి వైమానిక రక్షణ వ్యవస్థలే కారణమని ఆయన వివరించారు. ఆ క్రమంలో రెండు హెచ్‌క్యూ 9లు (చైనా తయారీ వైమానిక రక్షణ వ్యవస్థలు) నాశనం చేయబడ్డాయి. పాకిస్థాన్ వైమానిక దళం భారత గగనతలంలో పీఎల్-15లను ప్రయోగించడం ఆపివేసేంతగా అణచివేయబడింది. కేవలం మూడు గంటల్లో ఐఏఎఫ్ సు 30ఎంకేఐ, మిరాజ్ 2000, రాఫెల్ బృందాలు పాకిస్థాన్‌కు గట్టి దెబ్బలు తగిలించాయని కూపర్ తెలిపారు.
పాకిస్థాన్‌కు మరింత ఇబ్బంది
ఈ నకిలీ వార్తలు పాకిస్థాన్‌కు మరింత ఇబ్బందిని కలిగించాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఈ నకిలీ వార్తను సెనెట్‌లో ప్రస్తావించడం ద్వారా స్వయంగా ఇబ్బందికర పరిస్థితిలో చిక్కుకున్నారు. పాకిస్థాన్ ప్రముఖ పత్రిక ‘డాన్’ ఈ విషయంలో దార్‌ను ఖండించింది. దీనిపై బీజేపీ నేత అమిత్ మాలవీయా స్పందించారు. దార్ ప్రకటనను ‘ముఖం కాపాడుకోవడానికి చేసిన సిగ్గుమాలిన ప్రయత్నం’గా విమర్శించారు. పాకిస్థాన్ వైమానిక దళం గురించి వాదన ‘అతిగా ఉందని, దానిని పాకిస్థాన్ సొంత పత్రిక డాన్ కూడా ఫ్యాక్ట్-చెక్ చేసి ఖండించవలసి వచ్చింది’ అని మాలవీయా అన్నారు.
అసత్య వార్తల ప్రచారం..
భాజపా మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం కేరళ యూనిట్ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. దార్ వ్యాఖ్యలను ‘తలపట్టుకునేంత మూర్ఖత్వం’గా అభివర్ణించారు. అంతేకాదు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కూడా విమర్శలు చేశారు. గత నెలలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య దౌత్యపరమైన, సైనిక ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఇతర ప్రాంతాల నుంచి సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా నకిలీ కథనాలు, అసత్య వార్తలను వ్యాప్తి చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్
Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి