Share News

Donald Trump Warns: బాగ్రామ్ బేస్‌పై ట్రంప్ డిమాండ్..ఆఫ్ఘనిస్తాన్‌ హెచ్చరికలతో ఉద్రిక్తత

ABN , Publish Date - Sep 21 , 2025 | 09:51 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల తన ప్రకటనలో ఆఫ్ఘనిస్తాన్‌లోని బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను తమకు తిరిగి ఇవ్వాలన్నారు. చైనాతో పెరుగుతున్న ప్రభావాన్ని నిరోధించేందుకు ఆ ఎయిర్ బేస్ కీలకమన్నారు.

Donald Trump Warns: బాగ్రామ్ బేస్‌పై ట్రంప్ డిమాండ్..ఆఫ్ఘనిస్తాన్‌ హెచ్చరికలతో ఉద్రిక్తత
Donald Trump Warns

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్‌లో (Afghanistan) ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను (Bagram Base) తిరిగి అమెరికాకు ఇవ్వాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చైనాను పర్యవేక్షించేందుకు ఆ బేస్ ఎంతో కీలకమని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

అయితే, తాలిబన్లు మాత్రం అమెరికా సైనికులు తిరిగి రావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు, తాలిబన్ల ప్రతిస్పందనపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది.


ట్రంప్ ఈ అంశంపై నిరంతరం చర్చిస్తున్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ పోస్ట్‌లో దీనికి సంబంధించి ఓ పోస్ట్ చేశారు. మేము ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో చర్చలు జరుపుతున్నాము. బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను త్వరలో మా నియంత్రణలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఆఫ్ఘనిస్తాన్ అలా చేయకపోతే, మేము ఏం చేయబోతున్నామో మీకు తెలుస్తుందని ట్రంప్ హెచ్చరించారు.

trump.jpg


అంతకుముందు, చైనాపై నిఘా ఉంచడానికి కాబూల్ సమీపంలోని ఒక ప్రధాన ఆఫ్ఘన్ ఎయిర్ బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అమెరికా యోచిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. తాలిబన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జకీర్ జలాలీ దీనిపై అమెరికా చర్చలు జరపాలన్నారు. వారు పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ఆర్థిక, రాజకీయ సంబంధాలను నిర్మించుకోవచ్చు. కానీ అమెరికా సైనిక ఉపసంహరణ ఆమోదించబడదన్నారు.


బాగ్రామ్ ఎయిర్‌బేస్ చైనా అణ్వాయుధ తయారీ స్థలం నుంచి కేవలం ఒక గంట డ్రైవ్ దూరంలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇంకా, పనామా కాలువ నుంచి గ్రీన్లాండ్ వరకు అనేక ప్రదేశాలను అమెరికా స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నామని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ట్రంప్ చాలా కాలంగా బాగ్రామ్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 09:55 AM