Share News

Trump - Netanyahu: మీరెప్పుడూ నెగెటివ్‌గా ఎందుకు ఆలోచిస్తారు.. ఇజ్రాయెల్ ప్రధానిపై డొనాల్డ్ ట్రంప్ గుస్సా

ABN , Publish Date - Oct 06 , 2025 | 09:01 PM

హమాస్‌ సంధికి ఒప్పుకుందని చెప్పేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూకు ఫోన్ చేసిన ట్రంప్ ఆయనపై మండిపడ్డారు. నేతన్యాహూ నిరాసక్తంగా వ్యవహరించడంతో ఆయనది ఎప్పుడూ వ్యతిరేక ధోరణే అంటూ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Trump - Netanyahu: మీరెప్పుడూ నెగెటివ్‌గా ఎందుకు ఆలోచిస్తారు.. ఇజ్రాయెల్ ప్రధానిపై డొనాల్డ్ ట్రంప్ గుస్సా
Trump Netanyahu clash

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య శాంతి చర్చలు పురోగమిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ చర్చలపై అసంతృప్తితో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూపై (Benjamin Netanyahu) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. శాంతి ఒప్పందానికి హమాస్ సిద్ధమైన వేళ ట్రంప్ ఈ గుడ్ న్యూస్‌ను నేతన్యాహూతో పంచుకునేందుకు ట్రంప్ ఫోన్ చేశారు. అయితే, నేతన్యాహూ మాత్రం తన అసంతృప్తిని నిర్మొహమాటంగా బయటపెట్టారు. ఇందులో సంబరపడిపోయి వేడుక చేసుకునేందుకు ఏమీ లేదని అన్నారు. హమాస్‌తో చర్చలతో ప్రయోజం ఏమీ లేదని కూడా కామెంట్ చేశారు (Trump Netanyahu Negative Comment).

ఈ కామెంట్‌పై ట్రంప్ (Donald Trump) ఘాటుగా స్పందించారు. ‘మీరెప్పుడూ ప్రతికూల ధోరణితో ఎందుకు ఉంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇది విజయం. స్వీకరించడండి’ అని ట్రంప్ మండిపడ్డట్టు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. హమాస్ తన డీల్‌కు ఒప్పుకున్నందుకు ట్రంప్ ఒకింత రిలాక్స్ అయ్యారట. హమాస్ తన ప్రతిపాదనలకు ఒప్పుకోదని మొదట ఆయన భావించారట. ఆ తరువాత వారి రెస్పాన్స్ చూసి సంతోషపడ్డారట. కానీ ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం నిరాసక్తంగా వ్యవహరించడంతో ఒకింత కట్టుతప్పి అసంతృప్తి వ్యక్తం చేశారట.


ఇక నేతన్యాహూతో ఫోన్ కాల్ తరువాత ట్రంప్ ఇజ్రాయెల్‌ను ఉద్దేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. వెంటనే గాజాపై వైమానిక దాడులు నిలిపివేయాలని కోరారు. ఆ తరువాత మూడు గంటలకు నేతన్యాహూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

గాజా డీల్‌పై చర్చలు

హమాస్, ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన ప్రతినిధులు త్వరలో ఇజిప్ట్‌లో సమావేశం కానున్నారు. ముందుగా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుని, ఆ తరువాత ట్రంప్ డీల్‌లో తొలి దశ ప్రతిపాదనల అమలుకు ముందడుగు వేస్తారు. వారంలోపు తొలి దశను అమలు చేసి ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో హమాస్ ఉద్దేశిస్తూ పోస్టు చేశారు. ఈ విషయంలో త్వరపడాలని అన్ని వర్గాలను కోరారు.


ఇవి కూడా చదవండి:

అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల.. దాదాపు సగానికి పడిపోయిన వైనం

హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2025 | 09:01 PM