Pakistan: రెచ్చిపోయిన తిరుగుబాటుదారులు.. తొమ్మిది మంది సైనికులు మృతి
ABN , Publish Date - Aug 12 , 2025 | 09:57 PM
పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సాయుధ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సాయుధ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌తోపాటు ప్రాంటియర్ కార్ఫ్స్ కాంపౌండ్‌పై దాడి ముకుమ్మడి దాడికి దిగారు. ఈ దాడిలో తొమ్మిది మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు.
భద్రతా దళాలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి చేసినట్లు వాషుక్ జిల్లాకు చెందిన సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ దాడిలో తొమ్మిది మంది సైనికులు అక్కడికక్కడే మరణించారని చెప్పారు. ఇటీవల కాలంలో జరిగిన అత్యంత దారుణమైన దాడిగా దీనిని ఆయన అభివర్ణించారు.
ఇటీవల మస్తుంగ్ జిల్లాలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు. అందులో భాగంగా ఈ రైలు వెళ్తున్న సమయంలో ట్రాక్‌పై ఐఈడీ అమర్చి.. పేల్చారు. ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ పేలుడు ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడిన విషయం విదితమే. ఈ రైలు పెషావర్ వెళ్తుండగా ఈ పేలుడు సంభవించింది.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో హింసాత్మక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల కరాచీ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే కిల్లా అబ్దుల్లా జిల్లాలోని మార్కెట్‌పై బాంబు దాడి చేశారు. ఈ పేలుడులో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాంబు పేలుడు దాటికి మార్కెట్ సమీపంలోని పలు దుకాణాలు కుప్ప కూలిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సృష్టిలో మరో దారుణం.. ఇలా వెలుగులోకి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
For More International News And Telugu News