Share News

Big Twist in Srishti Fertility Case: సృష్టిలో మరో దారుణం.. ఇలా వెలుగులోకి..

ABN , Publish Date - Aug 12 , 2025 | 09:20 PM

సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు రోజుకోక్క క్లూ దొరుకుతుంది. అలాంటి వేళ.. మరో క్లూ బహిర్గతమైంది.

Big Twist in Srishti Fertility Case: సృష్టిలో మరో దారుణం.. ఇలా వెలుగులోకి..
Another Big Twist in The Srishti Fertility Case

హైదరాబాద్, ఆగస్ట్ 12: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు రోజుకోక్క క్లూ దొరుకుతుంది. తాజాగా ఈ సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో ఆది కాస్తా బహిర్గతమైంది. నమత్ర అనేది ఆమె నిజమైన పేరు కాదని తేటతెల్లమైంది. ఆమె అసలు పేరు అట్లూరి నీరజ అని స్పష్టమైనట్లు సమాచారం.


కానీ డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నీరజ ఈ ఐవీఎఫ్, సరోగసి వ్యవహారాలన్నీ నడిపిందని పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆమె మెడిసిన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే కాలేజీలో 1988 బ్యాచ్ మేట్స్‌తో సైతం ఆమె సరోగసి దందా చేయించినట్లు బహిర్గమైనట్లు తెలుస్తుంది.


నకిలీగా పెట్టుకున్న నమ్రత పేరుతో ఆమె ఈ అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఈ కేసును ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కి నార్త్ జోన్ పోలీసులు బదిలీ చేసిన విషయం విదితమే. మరోవైపు ఇప్పటికే అట్లూరి నీరజ అలియాస్ నమ్రతపై 15 కేసులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ సృష్టి కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 12 , 2025 | 09:25 PM