Cyber Attack: ఐరోపా విమానాశ్రయాలపై సైబర్ దాడి
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:58 PM
సాంకేతిక కారణాల వల్ల విమానాల ప్రయాణాల్లో జాప్యం తలెత్తినట్టు లండన్ హీత్రో ప్రకటించింది. దాదాపు యూరప్‌లోని అన్ని ప్రఖ్యాత విమానాశ్రయాలు సైబర్ దాడికి గురైనట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.
లండన్: సైబర్ నేరగాళ్లు సర్వీస్ ప్రొవైడర్లను టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. దీంతో బ్రసెల్స్ ఎయిర్‌పోర్ట్, లండన్‌లోని హీత్రో, బెర్లిన్ బ్రాండెన్‌బర్క్ ఎయిర్‌పోర్ట్ సహా పలు యూరోపియన్ విమానాశ్రయాలు (European airports) సైబర్ దాడికి గురయ్యాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సైబర్ దాడులతో మాన్యువల్ చెక్ ఇన్, బోర్డింగ్ వ్యవస్థల వంటి సేవల్లో అంతరాయం నెలకొంది. ఫలితంగా పలు విమానాలు ఆలస్యం కాగా, మరికొన్ని రద్దయ్యాయి.
బ్రసెల్స్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు కాగా.. విమానాలు కన్ఫర్స్ అయిన తర్వాత మాత్రమే ప్రయాణించాలని అధికారులు సూచించారు. మాన్యువల్ ప్రక్రియ చాలా స్లోగా ఉన్నందున షెన్‌గన్ విమాన ప్రయాణాలకు రెండు గంటల ముందు, నాన్ షన్‌గన్ విమాన ప్రయాణాలకు మూడు గంటల ముందు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని ప్రయాణికులను కోరింది. అటోమెటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సేవల్లో తలెత్తిన సమస్యలను సరిచేసేందుకు తమ సాంకేతిక బృంద శ్రమిస్తోందని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని అధికారులు ప్రకటించారు.
సాంకేతిక కారణాల వల్ల విమానాల ప్రయాణాల్లో జాప్యం తలెత్తినట్టు లండన్ హీత్రో ప్రకటించింది. దాదాపు యూరప్‌లోని అన్ని ప్రఖ్యాత విమానాశ్రయాలు సైబర్ దాడికి గురైనట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. కాగా, జ్యూరిచ్, ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయాలపై సైబర్ అటాక్ ప్రభావం లేదని, యథాప్రకారం సేవలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
భారత్‌తో యుద్ధంలో పాక్‌కు అండగా సౌదీ అరేబియా.. పాక్ రక్షణ మంత్రి ప్రకటన
చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం