Terrorist Attack: 200 మంది సైనికులను కిరాతకంగా చంపిన అల్‌ఖైదా టెర్రరిస్టులు..
ABN , Publish Date - May 18 , 2025 | 04:48 PM
Africa Al Qaeda Terrorists: అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు మూకుమ్మడిగా సైనిక స్థావరాలపై దాడులకు తెగబడ్డారు. ఏకంగా 200 మంది సైన్యాన్ని అతి దారుణంగా హతమార్చారు. ఇదేగాక ఉగ్రమూకలు ప్రజలను ఇళ్లు విడిచి వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Burkina Faso Terrorist Attack 2025: ఆఫ్రికన్ దేశమైన బుర్కినా ఫాసోలో అల్-ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థ సైన్యంపై దాడికి తెగబడింది. ఏకంగా 200 మంది సైనికులను పొట్టనపెట్టుకుంది. బుర్కినా ఫాసో చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉగ్రదాడి. దాడి అనంతరం అల్‌ఖైదా అనుబంధ సంస్థ JNIM ఇది చేసింది మేమే అని ప్రకటించుకుంది. జిబో నగరంలోని ఒక సైనిక స్థానిక స్థావరం, పోలీస్ స్టేషన్, మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని అనూహ్య దాడికి పాల్పడ్డాయి ఉగ్రమూకలు. ఈ దుర్ఘటనలో సైనికులతో పాటు పదుల సంఖ్యలో పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
200 మంది సైనికులు మృతి
ఈ వారం బుర్కినా ఫాసోలోని సైనిక స్థావరంపై జరిగిన దాడిలో 200 మంది సైనికులు మరణించారు. అల్-ఖైదాతో సంబంధం ఉన్న JNIM సంస్థ ఈ దాడికి బాధ్యత వహించినట్లు సాయుధ గ్రూపుల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించే ఒక NGO తెలిపింది. జిబోలోని ఒక పోలీస్ స్టేషన్, మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఆదివారం (మే 18, 2025) తెల్లవారుజామున దాడికి పాల్పడింది. అధికారికంగా ప్రాణనష్టం గురించిన వివరాలు వెల్లడికానప్పటికీ, జిబో నివాసితులు కూడా ఈ దాడుల్లో డజన్ల కొద్దీ మరణించినట్లు తెలుస్తోంది. బుర్కినా ఫాసో పొరుగునే ఉన్న మాలి, నైజర్ వంటి దేశాలు కూడా చాలా కాలంగా ఉగ్రవాద దాడులకు గురవుతున్నాయి. ఈ ప్రాంతాలు మొత్తం అల్-ఖైదా మద్దతుగల ఉగ్రవాదులకు నిలయంగా మారాయి.
ప్రజలను తరిమేస్తున్న టెర్రిరిస్టులు
బుర్కినా ఫాసోలోని JNIM అధిపతి ఉస్మాన్ డికో జిబో నివాసితులను ఇళ్లు ఖాళీ చేయమని ఆదేశిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉగ్రసంస్థ వరస దాడులకు పాల్పడుతూ భూభాగాలను ఆక్రమించుకుంటూ వెళ్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2 లక్షల మంది జనాభా ఉన్న జిబో నగరంలోని కీలక సైనిక తనిఖీ కేంద్రం తాజా దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. సాయుధ దళాల మందుగుండు సామాగ్రిని కూడా ఉగ్రమూకలు నాశనం చేశాయి. బుర్కినా ఫాసోలో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇదీ ఒకటని బుర్కినా ఫాసో సైనిక నాయకుడు ఇబ్రహీం ట్రోరే వెల్లడించారు.
జమాత్ నుస్రత్ ఉల్-ఇస్లాం వా అల్-ముస్లిమీన్ (JNIM) మృతి చెందిన సైనికుల సంఖ్యను ఎక్కువ చేసి చెబుతోందని బుర్కినా ఫాసో సైనిక వర్గాలు వాదిస్తున్నాయి. అమెరికాకు చెందిన SITE ఇంటెలిజెన్స్ గ్రూప్ ఒక అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఆఫ్రికాలోని సాయుధ గ్రూపుల ఆన్‌లైన్ కార్యకలాపాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. "గత నెలలో బుర్కినా ఫాసోలో JNIM కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ జరుగుతోంది. దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది" అని SITE తెలిపింది.
Read Also: US Tornado: అమెరికాలో సుడిగాలి తుఫాను.. ఇప్పటివరకు 27 మంది మృతి
Erdogan Powerplay: తుర్కియే అధ్యక్షుడి ఆధిపత్య ప్రదర్శన.. వేలు పట్టుకుని వదలకుండా..
Navy Ship Video: బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన నేవీ షిప్.. వీడియో చూస్తే మైండ్‌బ్లాంక్