Share News

US Tornado: అమెరికాలో సుడిగాలి తుఫాను.. ఇప్పటివరకు 27 మంది మృతి

ABN , Publish Date - May 18 , 2025 | 04:49 PM

అమెరికాలో గత 48 గంటలుగా తుఫానులు బీభత్సం (US Tornado) సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీటి కారణంగా ఇప్పటివరకు 27 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

 US Tornado: అమెరికాలో సుడిగాలి తుఫాను.. ఇప్పటివరకు 27 మంది మృతి
us Tornado Kentucky Leaves 27 Dead

అగ్రరాజ్యం అమెరికాను మరో తుఫాను చుట్టుముట్టింది. ఈ క్రమంలో అమెరికాలోని మిడ్‌వెస్ట్ ప్రాంతంలో వచ్చిన తుఫాను (US Tornado) కారణంగా ఇప్పటివరకు 27 మంది మరణించారు. వీరిలో ఆగ్నేయ కెంటుకీలో వచ్చిన సుడిగాలిలో తొమ్మిది మంది మరణించారు. శుక్రవారం రాత్రి లారెల్ ప్రాంతంలో సంభవించిన సుడిగాలి కారణంగా అనేక మంది తీవ్రంగా గాయపడినట్లు కెంటుకీ అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం బాధిత ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని లారెల్ కౌంటీ షెరీఫ్ జాన్ రూట్ కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.


చిక్కుకున్న వారి కోసం గాలింపు

మరోవైపు మిస్సోరిలో దాదాపు ఏడుగురు మరణించారు. ఈ క్రమంలోనే అధికారులు ఇంటింటికీ వెళ్లి చిక్కుకున్న వారి కోసం వెతుకుతున్నారు. మిస్సోరి ప్రాంతాన్ని అనేక తుఫానులు తాకగా, వాటిలో ఒక సుడిగాలి కూడా ఉంది. ఇవి విస్కాన్సిన్‌లో కూడా సంభవించాయి. దీంతో గ్రేట్ లేక్స్ ప్రాంతంలో మిలియన్ల మంది వినియోగదారులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తుఫాను ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ

ఈ క్రమంలో 5,000 కంటే ఎక్కువ ఇళ్లు ప్రభావితమయ్యాయని సెయింట్ లూయిస్ మేయర్ కారా స్పెన్సర్ తెలిపారు. ఈ తుఫానులు తీవ్రమైన వాతావరణ వ్యవస్థలో భాగంగా విస్కాన్సిన్‌లో మళ్లీ సుడిగాలుల రూపంలో సంభవించాయి. ఈ నేపథ్యంలో వరదలు ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

ఈ క్రమంలో మిస్సోరి, ఆగ్నేయ కెంటుకీతో సహా ఏడు రాష్ట్రాల్లో ఇది అత్యధిక ప్రభావాన్ని చూపింది. తుఫాను సమయంలో గంటకు 160 కి.మీ వేగంతో గాలులు వీచాయి. అనేక ఇళ్ల పైకప్పులు గాలిలో ఎగిరిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాలు శిథిలాల నిలయంగా మారాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మందిని సహాయ శిబిరాలకు తరలించారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..


US-China: ట్రేడ్ వార్‌కు 90 రోజులు బ్రేక్.. అమెరికా-చైనా చర్చలు ఫలప్రదం


Stock Market: భారత్-పాక్ కాల్పుల విరమణ.. స్టాక్ మార్కెట్లకు ఫుల్ జోష్


మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 18 , 2025 | 04:50 PM