US-China: ట్రేడ్ వార్‌కు 90 రోజులు బ్రేక్.. అమెరికా-చైనా చర్చలు ఫలప్రదం
ABN , Publish Date - May 12 , 2025 | 01:27 PM
ప్రతీకార సుంకాలతో వాణిజ్య వర్గాలను, పలు దేశాల స్టాక్ మార్కెట్లను షేక్ చేసిన అమెరికా, చైనా ఓ దారికి వచ్చాయి. తాజా సమావేశాలలో ఓ అవగాహనకు వచ్చాయి. ఒక దేశం మీద మరొకటి పోటాపోటీగా విధించుకున్న టారిఫ్‌లను తాత్కాలికంగా తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

ప్రతీకార సుంకాలతో వాణిజ్య వర్గాలను, పలు దేశాల స్టాక్ మార్కెట్లను షేక్ చేసిన అమెరికా (America), చైనా (China) ఓ దారికి వచ్చాయి. తాజా సమావేశాలలో ఓ అవగాహనకు వచ్చాయి. ఒక దేశం మీద మరొకటి పోటాపోటీగా విధించుకున్న టారిఫ్‌లను (Tarrif) తాత్కాలికంగా తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఈ రోజు స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు జరిగాయి.
ఇరు దేశాల మధ్య చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో ఇరు దేశాలు 90 రోజుల పాటు తమ టారిఫ్‌లను 115 శాతం మేర తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం అమెరికా దిగుమతుల మీద చైనా 125 శాతం సుంకాలు విధిస్తోంది. తాజా ఒప్పందం ప్రకారం 115 శాతం తగ్గింపు అంటే అమెరికా దిగుమతులపై చైనా పన్నులు పది శాతానికి దిగి వస్తాయి. ఇక, చైనా దిగుమతులపై అమెరికా 145 శాతం పన్నులను విధించింది. తాజా ఒప్పందం ప్రకారం ఆ పన్నులు 30 శాతానికి దిగి వస్తాయి.
90 రోజుల పాటు ఈ పన్నులు అమల్లో ఉంటాయి. ఈ మేరకు అమెరికా ట్రెజరరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత చాలా దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్థిక మాంద్యం భయాలతో ఆ పన్నులకు బ్రేక్ ఇచ్చారు. అయితే చైనాపై మాత్రం పన్నులను తగ్గించలేదు. తాజా సమావేశంలో చైనాతో కూడా డీల్ కుదుర్చుకున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..