Beauty Tips: ఖరీదైన క్రీములు..పార్లర్ ట్రీట్మెంట్లు అవసరమే లేదు..ఈ చిన్న చిట్కాతో మీ ముఖం ఎంతలా మెరిసిపోతుందో నమ్మలేరు.
ABN , Publish Date - Mar 18 , 2025 | 08:59 PM
Multani Matti Benefits for Skin: చర్మంపై మచ్చలు, మొటిమలు లేకుండా కాంతివంతంగా మృదువుగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకోసం రకరకాలు క్రీములు, ఫేస్ వాష్‌లు, బ్యూటీ పార్లర్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. వీటన్నింటి బదులు ఇంట్లోనే తయారుచేసిన ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీ ముఖం సహజకాంతితో వెలిగిపోతుంది.

Multani Matti Benefits for Skin: చర్మం ఎప్పుడూ కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కాలుష్యం, సూర్యరశ్మి, రోజువారీ మురికి ప్రభావంతో చర్మం ముదురు రంగులోకి మారి నిస్తేజతంగా అవుతుంది. అందుకని చాలా మంది ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులు, పార్లర్ ట్రీట్మెంట్లు ప్రయత్నిస్తారు. ఫలితంగ సహజమైన మెరుపును తిరిగి తెచ్చుకుందామన్నా సాధ్యపడదు. ఇలాంటప్పుడు ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే ఈ ముల్తానీ మట్టి చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది.
ఏ రకం చర్మంకైనా ఇదే బెస్ట్..
ముల్తానీ మట్టి అనేది పూర్వకాలం నుంచీ ఉపయోగించే అద్భుతమైన సహజ ఔషధం. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరచటమే కాకుండా నూనెలను తొలగించి సహజ కాంతిని ఇస్తుంది. ముఖ్యంగా, ఇది జిడ్డు చర్మానికి అత్యంత ఉపయోగకరమైనదిగా భావిస్తారు. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్‌తో కలిపి ముఖానికి అప్లై చేస్తే జిడ్డును ఇట్టే తొలగిస్తుంది. అలాగే, పొడి చర్మానికి పెరుగు కలిపి ఉపయోగిస్తే చాలామంచిది.చర్మానికి తేమను అందించి మృదువుగా మార్చుతుంది.
ఇంట్లో తయారుచేయడమెలా..
ఇంట్లోనే ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడం ఎంతో సులభం. దీనికి 2-3 చెంచాల ముల్తానీ మట్టిని తీసుకుని అవసరమైనంత పరిమాణంలో రోజ్ వాటర్ లేదా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సుమారు 20-25 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగితే తక్షణమే ఫలితాన్ని గమనించవచ్చు. ఇది చర్మం నుంచి మురికిని తొలగించి మృదువుగా, ప్రకాశవంతంగా మార్చుతుంది.
ముల్తానీ మట్టిని వాడే ముందు చర్మానికి ఎలాంటి అలెర్జీ వస్తుందో తెలుసుకోవడానికి ముందుగా చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. పొడి చర్మం ఉంటే దీన్ని వారానికి ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. కానీ జిడ్డు చర్మం కోసం రోజులో 3-4 సార్లు ఉపయోగించినా ఏ సమస్యా రాదు. ముఖ సౌందర్యానికి సరైన రీతిలో ముల్తానీ మట్టిని ఉపయోగించుకుంటే ఖరీదైన క్రీములు, పార్లర్ ట్రీట్మెంట్ల అవసరమే ఉండదు.
Read Also : Alcohol Drinking : మద్యం అలవాటు పోవాలంటే.. ఈ ఒక్క డ్రింక్ చాలు..
Acidity Remedies: తరచూ అసిడిటీతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం..
Vitamin B12 Deficiency: పురుష ఉద్యోగుల్లో 57 శాతం మందికి ఈ సమస్య.. జాగ్రత్త