Health: గర్భాశయం తొలగించకుండానే అరుదైన సర్జరీ..
ABN , Publish Date - Jul 04 , 2025 | 08:07 AM
తీవ్ర రక్తస్రావం, గర్భాశయ ఫైబ్రాయిడ్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు మెడికవర్ ఉమెన్ చైల్డ్ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు.

హైదరాబాద్ సిటీ: తీవ్ర రక్తస్రావం, గర్భాశయ ఫైబ్రాయిడ్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు మెడికవర్ ఉమెన్ చైల్డ్ ఆస్పత్రి(Medicover Women and Child Hospital)లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. గర్భాశయం తొలగించకుండా ఆమెకు సర్జరీ చేసినట్లు గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఖమ్మంకు చెందిన నందిత (35)మహిళకు పెద్ద గర్భాశయ ఫైబ్రాయిడ్ సమస్యతో వైద్యులను ఆశ్రయించగా గర్భాశయం తొలగించాల్సి ఉంటుందని చెప్పారు.
దీంతో ఆమె చికిత్సను వాయిదా వేస్తున్న క్రమంలో వారం క్రితం తీవ్రమైన రక్తస్రావంతో హిమోగ్లోబిన్ స్థాయి కేవలం 3.7జీఎం/డీఎల్‌గా ఉండగా అత్యవసర విభాగంలో అడ్మిట్ అయ్యారు. నందిత పాల్ పరిస్థితి వేగంగా క్షీణించడంతో ఆమెకు ఇప్పటికే 16 యూనిట్ల రక్తం ఎక్కించారు. గర్భాశయ ఫైబ్రాయిడ్ పరిమాణం 10సీఎం స్థానం కారణంగా, ప్రాణాంతక రక్త నష్టాన్ని నివారించడానికి హిస్టెరెక్టమీని సాధారణ చికిత్స నిర్వహిస్తారని,
కానీ ఆమెకు ఫైబ్రాయిడ్‌ను తొలగిస్తూ గర్భాశయాన్ని సంరక్షించే ప్రక్రియ (అత్యవసర మయోమెక్టమీ)ను రోబోటిక్, లాపరోస్కోపిక్ సర్జన్ పృథ్వీ పెరుమ్, సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి, అనస్థీషియా డాక్టర్ శిల్ప సహకారంతో నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావాన్ని తగ్గించేందుకు, తాత్కాలిక గర్భాశయ ధమని అడ్డుకునే అధునాతన సాంకేతికతను ఉపయోగించామని, ఈ విధానం అధిక ప్రమాదంలోనూ ఫైబ్రాయిడ్‌ను సురక్షితంగా తొలగించేందుకు సహాయపడిందన్నారు. ఆమె పూర్తిగా కోలుకుందని డిశ్చార్జీ చేసినట్లు వైద్యులు వివరించారు.
గర్భిణికి అరుదైన చికిత్స..
బంజారాహిల్స్: గర్భిణికి అరుదైన చికిత్స చేసిన వైద్యులు తల్లి, కవలల ప్రాణాలను కాపాడారు. బంజారాహిల్స్ టీఎక్స్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు వివరాలను వెల్లడించారు. జహీరాబాద్‌కు చెందిన అయేషా సిద్ధికా గర్భవతి. 28 వారాల కవలలున్న గర్భంతో డీసీడీఏ, తరచూ రక్తస్రావంతో బాధపడుతూ ఆమె తమ ఆస్పత్రికి వచ్చింది.
పరీక్షలు నిర్వహించగా ప్లాసెంటా ప్రీవియా ఉందని నిర్ధారణ అయిందన్నారు. క్యాత్‌ల్యాబ్‌లో ముందుగా రక్తస్రావాన్ని ఆపినట్టు చెప్పారు. ప్లసెంటా పూర్తిగా కవర్ చేసిన గర్భాశయంపై కత్తిరించడం ప్రమాదకరం కావడంతో రియల్‌టై అల్ర్టాసౌండ్ సహాయంతో కచ్చితమైన కోత విధించి కవల పిల్లలను సురక్షితంగా బయటకు తీసినట్టు చెప్పారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని చెప్పారు. వైద్యులు శ్రుతి, సుధా, అవినా్‌షదాల్, మేనేజింగ్ డైరెక్టర్ దీప్‌రాజు, ఈడీ రవీందర్‌రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
Read Latest Telangana News and National News