Cholesterol Control: ఈ చిన్ని విత్తనాలతో కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుంది..!
ABN , Publish Date - Jul 03 , 2025 | 08:15 PM
Cholesterol Controlling Foods: ఇటీవలి కాలంలో గుండె సంబంధిత సమస్యలు వేగంగా పెరిగిపోతున్నాయ్. ఇందుకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. మన శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వులు అనేక రకాల సమస్యలను వెంటబెట్టుకొస్తున్నాయి. అందుకే ఆరోగ్యంగా ఉండటాలంటే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలి. దీనికోసం కొన్ని ఆహారాలు దానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ చిన్ని పండ్ల విత్తనాలు..

Best Fruit for Cholesterol Control: మనం ఆరోగ్యం గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మంచి ఆహారమే రోజూ తింటున్నా.. శరీరంలో అనవసర కొవ్వులు పెరిగిపోతూనే ఉంటాయి. నేటికాలంలో గుండె సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయంటే.. అందుకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. మన జీవనశైలి నుంచి తీసుకునే ఆహారపానీయాల వరకూ అనేక అంశాలు చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఫలితంగా, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది . వీటన్నింటిని ఎదుర్కోవాలంటే మన ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకోవాలి. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవాలి. పోషకాహార నిపుణుల ప్రకారం కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఒకే ఒక పండు అద్భుతంగా సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.
దానిమ్మ కొలెస్ట్రాల్ అదుపు చేసే అద్భుతమైన పండు. దీని గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో కొవ్వులు అత్యంత వేగంగా కరిగిపోతాయని నిపుణులు అంటున్నారు. మీకు ఇప్పటికే అధిక బరువు సమస్య ఉంటే దానిమ్మపండ్లు తినడం వల్ల ధమనులలోని చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా కరిగిపోతుంది. కాబట్టి, దానిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి
దానిమ్మ ఉపయోగాలు..
ఎర్ర దానిమ్మపండ్లలో పాలీఫెనాల్స్, ఎలాజిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంటే LDL ఆక్సీకరణను నిరోధిస్తాయి. వాస్తవానికి, LDL ఆక్సీకరణ క్రమంగా ధమనులలో పేరుకుపోయి ప్లేక్‌గా మారుతుంది. ఇది ధమనుల ముడుచుకుపోవడానికి దారితీస్తుంది. ఈ కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. దానిమ్మపండు తింటే ధమనులు శుభ్రపడతాయి. అనేక పరిశోధన నివేదికలు కూడా ఇదే రుజువు చేశాయి. దీని క్రమం తప్పకుండా దానిమ్మ పండు గింజలు తీసుకోవడం వల్ల గుండె జబ్బు ముప్పును ఆపవచ్చు. ఎందుకంటే, ఈ చిన్ని విత్తనాలు గుండెపై ఒత్తిడిని తగ్గించి.. కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి.
పేగు ఆరోగ్యానికి మేలు
దానిమ్మ గింజల్లో దానిమ్మ రసం కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఫలితంగా తిన్న తర్వాత అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావు. కాబట్టి దీన్ని రోజువారీ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఇది జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాదు, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడుతుంది.
ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరానికి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. అంతేకాకుండా, వీటిలోని సహజ తీపి మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. మనం అలసిపోయినప్పుడు ఈ పండ్లను తినడం వల్ల వెంటనే ఉత్తేజితమవుతాం. ఉదయాన్నే దానిమ్మ పండ్లను తినడం వల్ల డయాబెటిస్, ఉబ్బసం వంటి అనేక సమస్యలను నివారించవచ్చు. ఎముకలకు కూడా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
డబ్ల్యూహెచ్‌వో సంచలన నివేదిక.. ప్రతి గంటకు 100 మంది..
వర్షాకాలంలో మొక్కజొన్న.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
For More Health News