Jowar vs Ragi Roti: జొన్న రొట్టె V/S రాగి రొట్టె.. ఏది బరువును తగ్గిస్తోంది..?
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:25 AM
జొన్న రొట్టె, రాగి రొట్టె రెండింటిలోనూ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా సేపు మన కడుపు నిండినట్లు అనిపించేలా చేసి అనవసరమైన వాటిని తినకుండా మనల్ని కంట్రోల్ చేస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత సమాజంలో బరువు తగ్గటానికి వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు జిమ్‌లు చేస్తూ.. డైట్ మెయింటైన్ చేస్తూ.. బరువు తగ్గటానికి తీవ్రంగా కష్టపడుతారు. మరికొంత మంది వారికి ఇష్టమైన ఆహారం కూడా తినకుండా.. బరువు తగ్గటానికి ఉపాయోగపడే అహారం మాత్రమే తీసుకుంటూ.. బరువు తగ్గే ప్రయత్నం చేస్తారు. కాగా, ఈ మధ్య కాలంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గటానికి వారు తినే ఆహారంలో మాత్రం ఒక్కపూట అయినా జొన్న రొట్టె లేదా రాగి రొట్టె తింటున్నారు.
పొట్ట రాకుడదని, రాత్రి సమయంలో జీర్ణం త్వరగా అవుతుందని ప్రతి ఒక్కరూ రొట్టె తినడాన్ని అలవాటుగా చేసుకున్నారు. అయితే.. జొన్న రొట్టె, రాగి రొట్టెలు రెండు బరువు తగ్గించడానికి ఉపాయోగడుతాయి. కానీ ఈ రెండు రొట్టెల్లో.. ఎది ఎక్కువ బరువు తగ్గిస్తుంది అనేది చాలా మంది ప్రశ్న. జొన్న రొట్టె, రాగి రొట్టె రెండు మంచివే అయినప్పటికీ బరువు తగ్గించడంలో ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకుద్దాం.
జొన్న రొట్టె, రాగి రొట్టె రెండింటిలోనూ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా సేపు మన కడుపు నిండినట్లు అనిపించేలా చేసి అనవసరమైన వాటిని తినకుండా మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఆరోగ్యంగా ఉండేలా చేయడమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవక్రియకు దోహదం చేస్తాయి. జొన్న రొట్టెలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. దీనివల్ల అధికంగా ఆహారం తీసుకోవడం జరగదు. ఇది మన బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
రాగి రొట్టె విషయానికి వస్తే.. రాగి రొట్టెలలో ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఇవి మన బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రాగి రొట్టెలు తింటే మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాగులలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మన ఎముకల ఆరోగ్యానికి కూడా దీనివల్ల మంచి జరుగుతుంది. అయితే జొన్న రొట్టె, రాగి రొట్టె విషయానికి వస్తే ఈ రెండు రొట్టెలలో బరువు తగ్గడానికి ఏది మంచిది అంటే జొన్న రొట్టెను ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల రాగి రొట్టె కంటే జొన్న రొట్టె తిన్నవారు త్వరగా బరువు తగ్గుతారని అంటున్నారు. ఇది ప్రభావవంతంగా బరువును తగ్గించడానికి దోహదం చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా
Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్